ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నా టాలెంట్ ఉంటే మాత్రమే హీరోలు సక్సెస్ సాధించడం జరుగుతుందనే సంగతి తెలిసిందే.అలా తన ప్రతిభతో బన్నీ ఐకాన్ స్టార్ గా గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు సినిమాసినిమాకు అంతకంతకూ ఎదుగుతున్నారు.
ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాలో నటిస్తున్న బన్నీ ఈ సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ ను ఖాతాలో వేసుకోవడం ఖాయమని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అయితే గత కొంతకాలంగా మెగా ఫ్యాన్స్ కు బన్నీ ఫ్యాన్స్ కు మధ్య విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రచారం వల్ల కొంతమంది అభిమానులు బన్నీకి దూరమవుతున్నారు.అయితే బన్నీ తండ్రి అల్లు అరవింద్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
చిరంజీవి అంటే బన్నీకి చాలా ఇష్టమని అల్లు అరవింద్ అన్నారు.
బన్నీ అల వైకుంఠపురములో మూవీ ఈవెంట్ లో ఒక డైలాగ్ చెప్పారని కట్టె కాలేవరకు చిరంజీవి అభిమానినే అని బన్నీ చెప్పిన ఆ డైలాగ్ నిజమేనని అల్లు అరవింద్ కామెంట్ చేశారు.
చిరంజీవి వేరే లెవెల్ అని చిరంజీవి స్థాయి అది అంటూ అల్లు అర్జున్ ఇంట్లో ఎప్పుడూ చిరంజీవి గురించి గొప్పగా చెబుతూ ఉంటాడని అల్లు అరవింద్ కామెంట్లు చేశారు.బన్నీకి చిరంజీవిపై ఏ స్థాయిలో అభిమానం ఉందో అల్లు అరవింద్ చెప్పకనే చెప్పేశారు.

చిరంజీవికి అల్లు అర్జున్ అంటే కొడుకుతో సమానమని అల్లు అరవింద్ అన్నారు.అల్లు అర్జున్ ఏం చేసినా చిరంజీవి ఎంజాయ్ చేసేవారని ఆయన కామెంట్లు చేశారు.చిన్నప్పుడు బన్నీ, చరణ్ కలిసి డ్యాన్స్ లు చేశారని అందులో బన్నీని మెగాస్టార్ ప్రోత్సహించడం, మరెన్నో వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.







