డెలివరీ బాయ్ గా మారిన ఒలంపిక్స్ గోల్డ్ మెడల్ ప్లేయర్..!

కరోనా అయ్యాక మొదలైన స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

అయితే తాజాగా వెనిజులా దేశానికి చెందిన ఫెన్సర్ ( కత్తి యుద్ధం చేసే ) రూబెన్ లిమార్డో చేసిన ఒక పని ప్రస్తుతం క్రీడా అభిమానులను ఆకర్షిస్తుంది.

ఇంతకీ విషయమేంటంటే 2012 లో గోల్డ్ మెడల్ గెలిచిన రూబెన్ లిమార్డో తాజాగా తన హోం టౌన్ల్ లో ఉబర్ ఈట్స్ తరుపున పని చేస్తున్నాడు.ఈ విషయాన్ని స్వయంగా రూబెన్ లిమార్డో ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నారు.

Olympic Champion Ruben Limardo Turns Delivery Boy, Ruben Limardo,Olympic Gold Me

తనతోపాటు నేషనల్ ఫెన్సర్ టీం అంతా జాబ్ చేస్తున్నారనే విషయాన్ని ఆయన బయటపెట్టారు.ప్రస్తుతం కరోనా కారణంగా వెనక్కి వెళ్ళిన టోర్నమెంట్లు ప్రారంభం అవ్వడానికి సమయం పట్టేలా ఉండడం ఇలాంటి సమయంలో అసలే క్రైసిస్ లో ఉన్న వెనుజులా ప్రభుత్వం తమకు సహాయం చేసే అవకాశాలు తక్కువగా ఉండడంతో డబ్బులు సంపాదించడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆయన తెలిపారు.

ప్రస్తుతం డెలివరీ బాయ్ గా కొత్త ఉద్యోగం మొదలుపెట్టిన రూబెన్ లిమార్డో వారానికి 100 యూరోస్ సంపాదిస్తున్నారని సమాచారం.

Advertisement
బియ్యం పిండిని ఇలా వాడితే బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా మిలమిల మెరుస్తారు

తాజా వార్తలు