ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా( Olympic Gold Medalist Neeraj Chopra ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.భారతదేశాన్ని విశ్వ వేదికపై గర్వంగా తల ఎగరేసుకునేలా చేసిన ఆటగాళ్లలో నీరజ్ కూడా ఒకరు.
ఆ ఒక్క విజయంతోనే మరి పెట్టుకోకుండా ప్రతి అంతర్జాతీయ పోటీల్లో గెలుపొందుతూ ఈ రియల్ హీరో సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాడు.ఆటల గురించే కాకుండా ఇతడు కొన్ని ఇతర విషయాల వల్ల కూడా వార్తల్లో నిలుస్తున్నాడు.
తాజాగా ఈ దిగ్గజ జావలిన్ త్రోయర్( Javelin Throw ) సరికొత్త బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీని కొనుగోలు చేసి వార్తల్లోకి ఎక్కాడు.
ధోనీకి బైక్స్ అంటే ఎంత ఇష్టమో నీరజ్‌కు కార్లు అంటే అంత ఇష్టం.
అందుకే ఇప్పటికే ఆల్రెడీ నాలుగు దాకా లగ్జరీ కార్లు ఉన్నా మళ్లీ ఇప్పుడు మరొక ఎస్‌యూవీని తన కార్ కలెక్షన్‌లో చేర్చుకున్నాడు.అతని వద్ద ఇప్పటికే ఫోర్డ్ ముస్టాంగ్ GT, రేంజ్ రోవర్ స్పోర్ట్, మహీంద్రా XUV700, టయోటా ఫార్చ్యూనర్, మహీంద్రా థార్ ఉన్నాయి.
మరోవైపు రేంజ్ రోవర్ కొత్త వెలార్ ఫేస్‌లిఫ్ట్ కోసం ఆర్డర్‌లను స్వీకరించడం ప్రారంభించినట్లు ప్రకటించింది.ఈ ఎస్‌యూవీ కారవే, డీప్ గార్నెట్ అనే రెండు కొత్త లెదర్ రంగులలో లభిస్తుంది.మెటాలిక్ వారెసిన్ బ్లూ, ప్రీమియం మెటాలిక్ జాదర్ గ్రే అనే రెండు కొత్త ఎక్స్‌టర్నల్ ఆప్షన్స్ కూడా కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి.ఈ కారులో 246hp పవర్ ఔట్‌పుట్ అందించే 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్, 201 hp పవర్ ఔట్‌పుట్ అందించే 2.0-లీటర్ ఇంజెనియం డీజిల్ ఇంజన్ ఆఫర్ చేశారు.
రేంజ్ రోవర్ వెలార్( Range Rover Velar ) ప్రస్తుత ధర రూ.89.41 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.అంటే నీరజ్ కొనుగోలు చేసిన కారు దాదాపు రూ.90 లక్షలని చెప్పవచ్చు.అయితే అప్‌డేటెడ్ మోడల్ ధర రూ.1 కోటి కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా.కొత్త ఎస్‌యూవీ డెలివరీలు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయి.