ఓహియోకు చెందిన క్రిస్టిన్ ఫాక్స్( Kristin Fox ) అనే మహిళ మార్చి 2020లో తీవ్రమైన ఫ్లూ ఇన్‌ఫెక్షన్( Flu Infection ) కారణంగా నాలుగు అవయవాలను కోల్పోయింది.ఫ్లూ వల్ల కలిగే ప్రమాదాల గురించి ఇతరులను హెచ్చరించడానికి ఆమె తాజాగా తన స్టోరీని ఫాక్స్ న్యూస్‌తో పంచుకుంది.
హైస్కూల్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసిన క్రిస్టిన్‌కు గొంతు నొప్పితో అనారోగ్యం మొదలైంది.నాలుగు రోజుల తరువాత, తక్కువ రక్తపోటు, ఆక్సిజన్ స్థాయిలతో ఆమె పరిస్థితి మరింత సీరియస్ గా మారింది.
దాంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.వైద్యులు ఆమె వెంటిలేటర్‌పై ఉంచారు.
ఆసుపత్రిలో ఆమెకు బాక్టీరియల్ న్యుమోనియా( Bacterial pneumonia ) ఉందని, ఇది ఆర్గాన్ ఫెయిల్యూర్‌కు దారితీసిందని తెలిసింది.

ఆమె కిడ్నీ పనిచేయడం మానేసింది, ఊపిరితిత్తులలో ఒకటి పనిచేయడం మానేసింది.ఆమె ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని ఆసుపత్రి సిబ్బంది భావించింది కానీ ఆమె అద్భుతంగా బతికింది.తర్వాత ఆమెకు సెప్సిస్( Sepsis ) అనే ఇన్‌ఫెక్షన్ వల్ల కలిగే ప్రాణాంతక వ్యాధి వచ్చింది.
ఆమె కీలక అవయవాలను కాపాడేందుకు, వైద్యులు వైద్యపరంగా ప్రేరేపించబడిన కోమాలో ఉంచారు.ఆమె రక్తనాళాలను ముడుచుకునే మందులు ఇచ్చారు.

ఇంతలోనే కోవిడ్ మహమ్మారి( Covid ) వ్యాప్తి చెందడం ప్రారంభించింది.క్రిస్టిన్ చాలా సీరియస్ పేషంట్ కావడంతో కుటుంబ సభ్యులను ఆమెతోనే ఉండడానికి వైద్యులు అనుమతించారు.ఆమె ప్రాణాలను కాపాడటానికి, వైద్యులు ఆమె చేతులు, కాళ్ళను నరికివేయవలసి వచ్చింది.సర్జరీ తర్వాత కోమా( Coma ) నుంచి మేల్కొన్న ఆమె మూడు రోజుల్లోనే ఊపిరి పీల్చుకోగలిగింది.
ఆమె గతేడాది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది.ఫ్లూ కూడా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని, అందుకే అనారోగ్యాన్ని అసలు నిర్లక్ష్యం చేయకూడదని ఆమె తన స్టోరీని ముగించింది.







