తూముకు మరమ్మతులు చేపట్టిన అధికారులు

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని నాగారం చెరువు రిజర్వాయర్ తూము గత కొన్ని రోజులుగా బిగుసుకుపోయి నీరు లీకు అవుతున్న విషయం తెలిసిందే.

దీంతో ఈ విషయాన్ని ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ కు రైతులు ప్రజలు తెలుపగ.

దీనిపై వెంటనే స్పందించిన ప్రభుత్వ విప్ మరమ్మత్తులు చేయవలసిందిగా ఇరిగేషన్ అధికారులు ఆదేశించారు.స్పందించిన అధికారులు నాగారం చెరువు తూములను పరిశీలించిన బిగిసుకుపోయిన నాగారం చెరువు తూముకు మరమ్మతులు చేసి నీరు లీకు కాకుండా చేశారు.

వేసవి సమయంలో పంటలకు నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు నీటి విడుదలకు వీలు ఉండేలా చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు గ్రామ రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు,మత్స్యకారులు ఉన్నారు.

Advertisement
గడువు ముగిసిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్న ఏజెన్సీ పై కేసు

Latest Rajanna Sircilla News