సమర్థుడైన అధికారిగా పేరుపొందిన సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ( JD Lakshminarayana )ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు.2019 ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా జనసేన( Janasena ) నుంచి పోటీ చేసి ఓటమి చెందిన లక్ష్మీనారాయణ ఆ తర్వాత కొంతకాలానికి జనసేన నుంచి బయటకు వచ్చారు.ప్రస్తుతం విశాఖలోనే ఉంటున్న ఆయన 2024 ఎన్నికల్లో మళ్ళీ అదే విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనూ లేరు.2024 నాటికి ఏదో ఒక పార్టీలో చేరాలని చూస్తున్నారు.అయితే ఆయా పార్టీలో చేరాలంటే ముందుగా తాను వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి పై చర్చించి వాటిపై స్పష్టమైన హామీ వచ్చిన తరువాతే తాను చేరేందుకు సిద్ధమంటూ ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే తనకు బీఆర్ ఎస్ , వైసిపి( BRS, YCP)ల నుంచి ఆఫర్లు వస్తున్నాయని, ఆయా పార్టీలో తనను చేరాలని ఒత్తిడి చేస్తున్నారని లక్ష్మీనారాయణ వివరించారు.
బీఆర్ఎస్ నుంచి తనకు ఆఫర్ వచ్చిందని, బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న తోట చంద్రశేఖర్ తాను ఓకే క్యాడర్ అని లక్ష్మీనారాయణ గుర్తు చేశారు.
తాము ఇద్దరూ కలిసి మహారాష్ట్రలో పనిచేశామని, తాము ఇద్దరం కూడా జనసేనలో గతంలో ఉన్నామని, ఇప్పుడు ఆయనకు ఏపీలో బిఆర్ఎస్ బాధ్యతలు అప్పగించడంతో తనను కూడా బీఆర్ఎస్ లో చేరాల్సిందిగా చంద్రశేఖర్ కోరినట్లుగా లక్ష్మీనారాయణ వివరించారు.వైసీపీ నుంచి ఇదేవిధంగా ఆఫర్లు వస్తున్నాయని, అప్పుడప్పుడు ఆ పార్టీ నేతలు తనను కలుస్తూ పార్టీలోకి రావాల్సిందిగా కోరుతున్నారని లక్ష్మీనారాయణ వివరించారు.

అయితే తాను ఏ పార్టీలో చేరాలన్న ముందుగా తాను కొన్ని అంశాలపై ఆయా పార్టీలతో చర్చిస్తానని, వాటిపై తనకు స్పష్టత ఇస్తేనే చేరుతానని లక్ష్మీనారాయణ వివరించారు. స్వతంత్రంగానే విశాఖ నుంచి పోటీ చేస్తానని అన్నారు.అయితే గతంలో లక్ష్మీనారాయణ అనేక పార్టీ నుంచి ఆఫర్లు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ నియమితులు కాబోతున్నారని హడావుడి జరిగింది.ఇక బీఆర్ఎస్ ఏపీలో ఏర్పాటు అయ్యే సమయంలోను ఆ పార్టీ అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ నియమించే అవకాశం ఉందని, ఆయన కూడా బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరిగింది.

అయితే లక్ష్మీనారాయణ మాత్రం కొన్ని కొన్ని సిద్ధాంతాలను నమ్ముకుని ఉండడంతో, తన డిమాండ్లను ఆయా పార్టీలకు వినిపించి వాటి విషయంలో సరైన క్లారిటీ వచ్చిన తర్వాత పార్టీలో చేరాలని , లేకపోతే 2019 ఎన్నికల మాదిరిగానే స్వతంత్రంగా పోటీ చేసి గెలవాలనే లక్ష్యంతో ఉన్నారు.ఇప్పటి వరకు ఎటువంటి అవినీతి మరకలు లేకపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ జనాల్లో మంచి గుర్తింపు ఉండడం, తదితర అంశాలను లెక్కలు వేసుకుంటున్న ఆయా పార్తీలు లక్ష్మీనారాయణ ను చేర్చుకునేందుకు సిద్ధంగానే ఉన్నాయి.