ఓట్స్, బీట్ రూట్.. స్కిన్ విషయంలో ఈ కాంబినేషన్ చేసే మ్యాజిక్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఓట్స్,‌ బీట్ రూట్( Oats, Beet root ).ఇవి రెండు ఆరోగ్యపరంగా ఎంత మేలు చేస్తాయో.

ఎన్ని ప్రయోజనాలను చేకూరుస్తాయో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.అయితే ఓట్స్ మరియు బీట్ రూట్ లో అనేక బ్యూటీ సీక్రెట్ కూడా దాగి ఉన్నాయి.

అందుకే చాలా కాలం నుంచి వీటిని సౌందర్య ఉత్పత్తులుగా వినియోగిస్తున్నారు.ఇకపోతే ఓట్స్ మరియు బీట్ రూట్ ను విడివిడిగా కన్నా కలిపి వాడితే ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు.

ఓట్స్, బీట్ రూట్ కాంబినేషన్ స్కిన్ విషయంలో మ్యాజిక్ క్రియేట్‌ చేస్తుంది.

Oats And Beetroot Combination Creates The Magic In Skin Oats, Beetroot, Skin Ca
Advertisement
Oats And Beetroot Combination Creates The Magic In Skin! Oats, Beetroot, Skin Ca

అందుకోసం ముందుగా ఒక చిన్న బీట్ రూట్ తీసుకుని పీల్ తొల‌గించి ముక్కలుగా కట్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.గ్రైండ్ చేసుకున్న‌ మిశ్రమం నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ పౌడర్ మరియు రెండు టేబుల్ స్పూన్లు హాట్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమంలో నాలుగైదు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ బీట్ రూట్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Oats And Beetroot Combination Creates The Magic In Skin Oats, Beetroot, Skin Ca

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు పూతలా అప్లై చేసుకోవాలి.అనంతరం చర్మాన్ని 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఫైనల్ గా వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ రెమెడీని కనుక ఫాలో అయ్యారంటే మీ స్కిన్ కలర్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుందిముడతలు ఏమైనా ఉంటే మాయం అవుతాయి.

న్యూస్ రౌండప్ టాప్ 20

స్కిన్ ఏజ్ అనేది ఆలస్యం అవుతుంది.ముదురు రంగు మచ్చలు ఉంటే క్రమక్రమంగా త‌గ్గు ముఖం పడతాయి.

Advertisement

ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి.చర్మ రంధ్రాలు లోతుగా శుభ్రం అవుతాయి.

మొటిమలు బెడద సైతం తగ్గుతుంది.కాబట్టి అందంగా కాంతివంతంగా మెరిసిపోవాల‌ని భావించేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీ ని ఫాలో అవ్వండి.

తాజా వార్తలు