బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ బాలీవుడ్ లో చేసే హంగామా అంతా ఇంతా కాదు అనే చెప్పాలి.ఈయన పార్టీలు బాలీవుడ్ లో చాలా ఫేమస్.
ఎంత ఫేమస్ అంటే స్టార్ లు సైతం ఈయన పార్టీకి తరలి వస్తారు.మరి స్టార్ హీరోలు మాత్రమే కాదు యంగ్ బ్యాచ్ కూడా ఈయన పార్టీలకు స్పెషల్ గా రెడీ అయ్యి మరీ ఫోటోలకు పోజులు ఇస్తూ ఉంటారు.
ఈ పార్టీలకు స్టార్ కిడ్స్ అంతా కలిసి ఒకేచోట రచ్చ రచ్చ చేస్తూ పార్టీ కల్చర్ అనే పేరుతొ విందు చేసుకుంటూ ఉంటారు.మరి ఈ పార్టీలకు బాలీవుడ్ స్టార్ కిడ్ అయినా నైసా దేవగన్ కూడా మినహాయింపు ఏమీ కాదు.
అజయ్ దేవగన్, కాజోల్ జంట కుమార్తె నే ఈ నైసా దేవగన్.ఈమె కూడా ఈ పార్టీలకు హాజరవుతూ టీనేజ్ ను ఫ్రెండ్స్ తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తుంది.
ఈమె ముందు ముందు హీరోయిన్ అవుతుందో లేదో ఎవ్వరికి తెలియదు కానీ పక్కా పార్టీ గాళ్ అనే పేరు మాత్రం ఈ స్టార్ కిడ్ కు వచ్చింది.ఈమె తరచుగా పార్టీలు చేసుకుంటూ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంది.
ఇటీవలే ఈమె ఫ్రెండ్ సోషల్ మీడియాలో నైసా పార్టీ చేసుకుంటున్న ఫోటోలను పోస్ట్ చేయగా అవి కాస్త నెట్టింట వైరల్ అయ్యాయి.
ఇక ఇప్పుడు మళ్ళీ మహికా రాంపాల్ తో కలిసి, అలాగే జాన్వీ కపూర్ తో, షనాయా కపూర్ తో నైసా పార్టీలకు వెళ్తూ చిల్ అవుతూ ఉంది.
అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలపై నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఎప్పుడు పార్టీలకు వెళ్తూ చిల్ కావడమేనా.లేదంటే హీరోయిన్ అయ్యేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నావా అంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు.

అయితే ఈమె ప్రెసెంట్ కెమెరా వెనుక పని నేర్చుకుంటుంది అని నచ్చితే హీరోయిన్ అవుతుంది అని వార్తలు వస్తున్నాయి.మరి ఈమె కుమార్తె హీరోయిన్ ఎంట్రీ విషయం అయితే ఈ స్టార్ కపుల్ నోరు విప్పడం లేదు.మరి ఈమె హీరోయిన్ గా మారుతుందో లేదో చూడాలి.