భారతదేశంలోని చాలా మంది విద్యార్థులు యునైటెడ్ స్టేట్స్( United States )కు వెళ్లాలని కలలు కంటారు.ఎందుకంటే వారు దానిని అద్భుతమైన అవకాశాలకు కేరాఫ్ అడ్రస్‌గా చూస్తారు.
ఇతర దేశాల్లో కంటే ఎక్కువగా యూఎస్‌లోనే భారతీయులు( Indians ) చదువుకోవడానికి మొగ్గు చూపుతున్నారని అనడంలో అతిశయోక్తి లేదు.ఎందుకంటే అక్కడ వారు మెరుగైన విద్య, మరిన్ని ఉద్యోగ అవకాశాలను పొందగలమని నమ్ముతున్నారు.
యూఎస్‌లో ఉన్నత ప్రమాణాలు కలిగిన అనేక మంచి యూనివర్సిటీలు ఉన్నాయి.కానీ భారతదేశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అధ్యయనాలకు తక్కువ అవకాశాలు ఉన్నాయి.
మాథ్స్, కంప్యూటర్ సైన్స్ వంటి సబ్జెక్టులలో మంచి నైపుణ్యం ఉన్న భారతీయ విద్యార్థులకు( Indian Students ), యూఎస్ ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉంటుంది, ఎందుకంటే వారు తమ చదువు పూర్తయిన తర్వాత ఆ రంగాలలో వెంటనే ఉద్యోగం పొందవచ్చు.వారు కొన్ని ప్రోగ్రామ్‌ల ద్వారా చదువుతూ కూడా డబ్బు సంపాదించవచ్చు.సత్య నాదెళ్ల, శంతను నారాయణ్ వంటి ఎన్నారైలు ఇండియన్ స్టూడెంట్స్‌కి స్పూర్తిగా నిలుస్తున్నారు.
మెరుగైన ఉద్యోగావకాశాలతో పాటు, భారతీయ ఐటీ నిపుణులు యూఎస్‌లో వర్క్ కల్చర్‌ను ఇష్టపడుతున్నారు.
అందుకే చాలా మంది భారతీయ టెక్కీలు( Indian Techies ) కూడా అక్కడ పనిచేయాలనుకుంటున్నారు.నిజానికి యూఎస్‌లో పర్మనెంట్ రెసిడెన్సీ( Permanent Residency )కి అనుమతి పొందడంలో కొన్ని వీసా సమస్యలు ఉన్నాయి.
చాలా కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి కూడా నెలకొంది.అయినా ఇండియన్స్ తమతో పాటు కుటుంబ సభ్యులు మెరుగైన అవకాశాలు చేజిక్కించుకోవడం కోసం అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకుంటున్నారు.
వీసా సమస్యలతో( Visa Problems ) పాటు ఉద్యోగాల తొలగింపులు కూడా అమెరికాలో ఎక్కువగానే ఉన్నాయి.ఇలా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నా చాలా మంది భారతీయులు ఇప్పటికీ అమెరికాకు వెళ్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.2021లో, దాదాపు 78,000 మంది ప్రజలు తమ భారత పౌరసత్వాన్ని వదులుకుని యూఎస్‌ని తమ కొత్త ఇల్లుగా ఎంచుకున్నారు.అలాగే, 2021-2022 విద్యా సంవత్సరంలో దాదాపు 200,000 మంది భారతీయ విద్యార్థులు యూఎస్‌లో చదువుకోవడానికి వెళ్లారు, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 19% పెరుగుదల.
యూఎస్‌లోని మొత్తం విదేశీ విద్యార్థులలో భారతీయులు 21% ఉన్నారు.మొత్తంమీద, భారతీయులకు యునైటెడ్ స్టేట్స్ అగ్ర ఎంపికగా మిగిలిపోయింది.