టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు రామ్ చరణ్ ( Ramcharan ) ఒకరు.ఈయన చిరంజీవి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేడు పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ కి ఇండస్ట్రీలో కొంతమంది ప్రాణ మిత్రులు ఉన్నారా అనే సంగతి మనకు తెలిసిందే అలాంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) కూడా ఒకరు.

వీరిద్దరి మధ్య స్నేహబంధం ఎలాంటిదో ఆర్ఆర్ఆర్ సినిమాలో ( RRR Movie ) స్పష్టంగా చూపించారు.అయితే కేవలం సినిమాలో మాత్రమే కాకుండా బయట కూడా వీరి స్నేహబంధం అలాంటిదేనని చెప్పాలి.ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్ చరణ్ గురించి చరణ్ ఎన్టీఆర్ గురించి ఎన్నో తెలియని విషయాలను బయటపెట్టారు.
ఇలా వీరి వ్యాఖ్యలు చూస్తే వీరి మధ్య ఇంత మంచి బాండింగ్ ఉందా అని ఆశ్చర్య పోతున్నారు.

ఇకపోతే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రామ్ చరణ్ గురించి ఎన్టీఆర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వారు అవుతున్నాయి.ఈ ఇంటర్వ్యూలో భాగంగా చరణ్ వీక్ నెస్ గురించి తారక్ బయటపెట్టారు.సాధారణంగా మనం ఎవరైనా కొత్త వాళ్లను ఒకసారి కలిస్తే వారి పేర్లను మనం గుర్తుపెట్టుకుంటాము కానీ చరణ్ మాత్రం ఒకసారి కలిసి వారి పేర్లను చెబితే కనుక వెంటనే మర్చిపోతాడు.
తిరిగి వారిని కనుక పిలిచాలి అంటే కొత్త కొత్త పేర్లతో పిలుస్తూ ఉంటారని చరణ్ లో ఉన్నటువంటి వీక్ నెస్ ఇదే అంటూ తారక్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ప్రస్తుతం వీరిద్దరు వారి పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.







