ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో హిట్ కొట్టి ఫుల్ జోష్ లో ఉన్నాడు.ఈ సినిమా లో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా ప్రధాన పాత్రలో నటించాడు.
వీరిద్దరూ కూడా ఈ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.అత్యంత భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో బ్లాక్ బస్టర్ హిట్ చేసేసారు.
ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.నాలుగేళ్ళ నిరీక్షణకు మొన్నటి తో ఫుల్ స్టాప్ పడింది.
ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో టీమ్ అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఎన్టీఆర్ కూడా ఈ సినిమా హిట్ పై ఆనందంగా ఉన్నారు.
ఎన్టీఆర్, చరణ్ నటించిన ఈ సినిమా అంతటా రిలీజ్ అయ్యి రికార్డ్ సృష్టిస్తూ సరికొత్త చరిత్రను లిఖిస్తుంది.

ఈ సినిమాలో ఇద్దరు స్టార్స్ కూడా పోటాపోటీగా నటించారు.తమ పాత్రలకు సరైన న్యాయం చేసి తెరమీద వారు మాత్రమే కనిపించేలా ఆ పాత్రల్లో లీనం అయిపోయారు.ఇటీవలే ఈ సినిమా 500 కోట్ల మార్క్ ను టచ్ చేసి రికార్డులను క్రియేట్ చేసింది.
ఇక ఇటీవలే ఎన్టీఆర్ ఒక లేఖను కూడా రిలీజ్ చేసి ఈ సినిమా తన కెరీర్ లోనే మర్చిపోలేని సినిమాగా ట్రిపుల్ ఆర్ ని వర్ణించడం పలువురిని ఆకట్టుకుంది.

ఇక ఇది ఇలా ఉండగా తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త చెప్పాడు తారక్.ఆయనను హిందీలో స్ట్రెయిట్ హిందీ సినిమా ఎవరితో చేస్తావ్ అని అడిగారు.అందుకు తారక్ ఆసక్తికర విషయాన్నీ తెలిపాడు.
హిందీలో సినిమా చేయాల్సి వస్తే ఆయన రాజ్ కుమార్ హిరాణి తో చేస్తా అని అన్నారు.ఈయన సినిమాలలో సహజత్వంతో కూడిన ఎమోషన్స్ ఉంటాయని అలాగే ఆయన వాటిని తెరకెక్కించే తీరు తనకు ఇష్టం అని తెలిపాడు.
అలాగే భారీ బడ్జెట్ సినిమాల్లో సంజయ్ లీలా భన్సాలీ రూపొందించే సినిమాలు అంటే లైక్ చేస్తానని తారక్ చెప్పడం ఆసక్తికరంగా మారింది.







