నందమూరి తారకరత్న ఆరోగ్యం విషయంలో గత కొన్నిరోజులుగా ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదు.
ఆయన కుటుంబ సభ్యులు సైతం తారకరత్న పరిస్థితికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించడానికి ఇష్టపడలేదు.
అయితే తాజాగా అమిగోస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ లో తారకరత్న ఆరోగ్యం గురించి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాట్లాడతారని అందరూ భావించారు.అయితే వాళ్లిద్దరూ ఇందుకు సంబంధించి ఎలాంటి కామెంట్ చేయలేదు.
అయితే నందమూరి ఫ్యాన్స్ మాత్రం తారకరత్న హెల్త్ గురించి ఈ ఇద్దరు హీరోలు మాట్లాడితే అమిగోస్ మూవీ కంటే తారకరత్న హెల్త్ గురించి ఎక్కువగా చర్చ జరిగి సినిమాకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది.మరోవైపు తారకరత్న ఆరోగ్యం విషయంలో పెద్దగా మార్పు లేదని అందుకే ఈ హీరోలు ఎలాంటి కామెంట్ చేయలేదని సమాచారం అందుతోంది.
తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి కామెంట్ చేసినా ఆ కామెంట్ వల్ల వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.ఈ రీజన్ వల్లే కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్ అయ్యారని తెలుస్తోంది.తారకరత్న త్వరగా కోలుకుని సాధారణ మనిషి అయితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఆ మంచి రోజు రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.
మరోవైపు అమిగోస్ సినిమాకు బుకింగ్స్ ఆశాజనకంగా లేవు.బింబిసార స్థాయిలో ట్రైలర్ తో అమిగోస్ మూవీ మెప్పించలేదు.సినిమాకు టాక్ పాజిటివ్ గా ఉంటే మాత్రమే ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది.9 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు అమ్ముడయ్యాయి.కనీసం 10 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వస్తే మాత్రమే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy