సినిమా ఇండస్ట్రీలో హీరోల నటనకు మాత్రమే కాకుండా వారి చేసే డ్యాన్సులకు కూడా చాలా మంచి క్రేజ్ ఉంటుంది.ఇలా హీరోలు చేసే డాన్సులు వల్ల కూడా చాలామంది వారికి అభిమానులుగా మారిపోవడం లేదా సినిమాలు కూడా హిట్ అవ్వడం వంటివి జరుగుతూ ఉంటాయి.
అయితే అప్పట్లో నేలను చూడకుండా డాన్స్ చేసే సత్తా ఉన్న హీరోలలో చిరంజీవి (Chiranjeevi) ఒకరు.ఈయన ఎంతో అద్భుతమైన గొప్ప డాన్సర్.
ఇలా చిరంజీవిని మించి ఎవరు అప్పట్లో డాన్స్ చేసే హీరో లేరనే చెప్పాలి.ఇప్పటికి కూడా చిరంజీవి డాన్సులో ఓ స్టైల్ ఉంటుంది.
అయితే ఈ జనరేషన్లో ఉన్నటువంటి హీరోలలో ఎవరు బెస్ట్ డాన్సర్ అనే సందేహం ప్రతి ఒక్కరిలోనే కలుగుతుంది.ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నటువంటి ఎన్టీఆర్(NTR) అల్లు అర్జున్ (Allu Arjun) రామ్ చరణ్(Ramcharan) వంటి హీరోలందరూ కూడా అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తారు.మరి ఈ హీరోలలో బెస్ట్ డాన్సర్ ఎవరు అనే విషయం గురించి తాజాగా సీనియర్ నటుడు సుమన్ ( Suman) ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ప్రస్తుత జనరేషన్లో ఉన్నటువంటి హీరోల డాన్స్ గురించి తెలిపారు.
ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ అప్పట్లో చిరంజీవి గారు చాలా అద్భుతంగా డాన్స్ చేస్తారు.అయితే ఈయన రేంజ్ లో డాన్స్ చేసే ప్రస్తుత హీరోలు ఎవరు అనే విషయానికి వస్తే అలాంటి సత్తా ఉన్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ఒకరు.చిరంజీవి తర్వాత అలా డాన్స్ చేసే సత్తా కేవలం ఎన్టీఆర్ లో మాత్రమే ఉంది అంటూ ఈ సందర్భంగా సుమన్ ఎన్టీఆర్ డాన్స్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు మాత్రమే కాకుండా గొప్ప డాన్సర్ అని కూడా చెప్పాలి.ఈయన డాన్స్ చేస్తుంటే అలానే తన కాళ్ళ వైపు చూస్తూ ఉండిపోయేలా తారక్ డాన్స్ చేస్తారని చెప్పవచ్చు.
ఇలా తారక్ డాన్స్ గురించి ఇదివరకే ఎంతోమంది సెలబ్రిటీలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.