బాహుబలిలో ఎన్టీఆర్‌?

‘బాహుబలి’ గురించి మీడియాలో వార్త లేని రోజు లేదు.ప్రతి రోజు ఏదో బాహుబలి గురించి ఏదో ఒక వార్తను మీడియా మోసుకు వస్తూనే ఉంది.

గత మూడు నాలుగు సంవత్సరాలుగా ‘బాహుబలి’ సినిమా గురించి మీడియాలో వార్తలు రావడం చాలా సర్వసాధారణం అయ్యాయి.అవి పుకార్లు కావచ్చు, మరే ఇతర విషయం కావచ్చు మీడియాలో అయితే బాహుబలి ఉంటూనే ఉన్నాడు.

ప్రస్తుతం బాహుబలి రెండవ పార్ట్‌ చిత్రీకరణ జరుగుతున్న విషయం తెల్సిందే.ఆ సినిమా గురించి వందల్లో వార్తలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి.

తాజాగా బాహుబలి రెండవ పార్ట్‌లో ఎన్టీఆర్‌ నటించబోతున్నాడు అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి.టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళితో ఎన్టీఆర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

Advertisement

ఎన్టీఆర్‌ ఈ స్థాయిలో ఇప్పుడు ఉన్నాడు అంటే కారణం రాజమౌళి అని చెప్పవచ్చు.పలు సూపర్‌ హిట్స్‌ను ఎన్టీఆర్‌కు అందించిన రాజమౌళి మరోసారి ఎన్టీఆర్‌తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది.

అయితే ఇప్పట్లో ఆ సినిమా ఉండదని అంతా భావిస్తున్న తరుణంలో, ‘బాహుబలి’లో ఎన్టీఆర్‌ నటించనున్నాడా అంటూ ఫిల్మ్‌ సర్కిల్స్‌లో ఒక ప్రశ్న బాగా ప్రచారం జరుగుతోంది.అందుకు కారణం కూడా ఉంది, ఎందుకంటే ఇటీవల రాజమౌళిని ఎన్టీఆర్‌ ఏకాంతంగా కలుసుకున్నాడు.

‘బాహుబలి’లో చిన్న గెస్ట్‌రోల్‌లో నటించేందుకు ఎన్టీఆర్‌ను రాజమౌళి ఒప్పించినట్లుగా ప్రచారం జరుగుతోంది.ఈ ప్రచారంలో ఎంత నిజం ఉంది అనేది తెలియదు కాని, ‘బాహుబలి’లో ఎన్టీఆర్‌ ఉంటే అది సంచలమే అని విశ్లేషకులు అంటున్నారు.