మంచు హీరోలు క్లాసిక్ చిత్రాలపై పడుతున్నారు.మంచు విష్ణుకు చాలా కాలంగా ‘భక్త కన్నప్ప’ సినిమాపై మోజు పెంచుకుని ఉన్నాడు.
కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’ సినిమాకు మంచు విష్ణు రీమేక్ చేయబోతున్న విషయం తెల్సిందే.తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది.
త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కబోతుంది.ఇక తాజాగా మంచు విష్ణు తనకు జీవితంలో రామాయణం చిత్రంలో నటించాలనే కోరిక ఉందని చెప్పుకొచ్చాడు.
రామాయణంలోని రాముడు లేదా రావణుడి పాత్రలో నటించాలని కోరుకుంటున్నట్లుగా మంచు విష్ణు పేర్కొన్నాడు.
మంచు విష్ణు ఆలోచనలు అలా ఉండగా, మోహన్‌బాబు ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి.
తెలుగు క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా చెప్పే ‘గుండమ్మ కథ’ను రీమేక్ చేయాలని ఉంది అంటూ తాజాగా మోహన్‌బాబు అన్నాడు.ఆ సినిమా రీమేక్ రైట్స్ ఎవరి వద్ద ఉన్నా కూడా కొని రీమేక్ చేస్తాను అంటూ గట్టిగా మోహన్‌బాబు అన్నాడు.
మంచు విష్ణు, రాజ్ తరుణ్‌లతో ఆ రీమేక్ చేస్తాను అంటూ మోహన్‌బాబు అన్నాడు.ఇక గతంలో కూడా ‘రౌడీ అల్లుడు’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రాలు కూడా రీమేక్ చేయాలని మంచు హీరోలు అన్నారు.
ఇలా టాలీవుడ్ క్లాసిక్ సినిమాలపై మంచు హీరోలు పడుతున్నారు.మంచు వారు ఆ సినిమాలను రీమేక్ చేసి పాడు చేస్తారా ఏంటి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.







