మెగా ప్రిన్సెస్ నిహారిక హీరోయిన్‌గా నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఒక మనసు’.ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఆడియో విడుదలకు సిద్దం అయ్యింది.
ఈనెల 27న అంటే రేపు ఈ చిత్రం ఆడియోను విడుదల చేస్తాం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించిన విషయం తెల్సిందే.కాని చివరి నిమిషంలో ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం వాయిదా పడ్డట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
నిహారిక సినిమా ఆడియో విడుదలకు మెగా హీరోలు చిరంజీవితో పాటు పలువురు వస్తారు అంటూ ముందు నుండి ప్రచారం జరుగుతోంది.చిరంజీవి సైతం వచ్చేందుకు ఓకే చెప్పాడు అన్నారు.అయితే చిరంజీవి రీ ఎంట్రీ సినిమాను ఈనెల 29న ప్రారంభించబోతున్నారు.
150వ సినిమా ప్రారంభోత్సవం కోసం చిరంజీవి ఏర్పాట్లలలో ఉన్నాడు.దాంతో ఆయన ‘ఒక మనసు’ ఆడియో విడుదలకు వచ్చే అవకాశాలు లేవు.అందుకే రేపు విడుదల కావాల్సిన ఆడియోను వాయిదా వేసినట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
చిరంజీవితో పాటు చరణ్ మరియు అల్లు అర్జున్‌లు సైతం ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది.మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇవ్వబోతున్న మొదటి హీరోయిన్ అవ్వడంతో అందరి దృష్టి ఈ అమ్మడిపైనే ఉంది.
ఈ చిత్రానికి రామరాజు దర్శకత్వం వహించగా, టీవీ9 మరియు మధుర శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.వచ్చే నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మెగా ప్రిన్స్ ఇప్పటికే పలు బుల్లి తెర కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన విషయం తెల్సిందే.







