టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి తెలియని వారు లేరు.నందమూరి వారసుడిగా సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా తెలుగు తెరపై ఎంట్రీ అతి తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా కూడా చక్రం తిప్పుతున్నాడు.అయితే ఒకప్పుడు ఎన్టీఆర్ బాల నటుడిగా తన కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఈయన మొదటి నుండి నటన పరంగా బాగా ఆకట్టుకుంటూ తన క్రేజ్ పెంచుకుంటూ వచ్చాడు.తనను విమర్శించిన వారు సైతం ఇప్పుడు పొగడ్తలు కురిపించేలా ఎన్టీఆర్ చేసుకున్నాడు.
అందుకు ఈయన చాలానే కష్టపడ్డాడు.ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకుని పాన్ ఇండియా స్టార్ గా కెరీర్ లో దూసుకు పోతున్నాడు.
ఇక ఈయన మొదటి సారిగా 2001లో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
నిన్ను చూడాలి అనే సినిమాతో సోలో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన తారక్ కు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.
ఎన్టీఆర్ మొదటి సినిమాలోనిది ఈ ఫోటో.ఈ ఫొటోలో తారక్ నూనూగు మీసాలతో వచ్చి రాని గడ్డంతో చబ్బీ లుక్స్ తో కనిపిస్తున్నాడు.ఈ పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమా హైప్ బాగానే వచ్చిన ఎన్టీఆర్ కటౌట్ కు తగ్గట్టు సినిమా లేకపోవడంతో ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

అయినా ఎన్టీఆర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది.రవీనా రాజ్ పుత్ తో ఎన్టీఆర్ క్లాస్ లుక్ అదిరింది అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం చెబుతున్నారు.ఆ సినిమా లోని ఒక సాంగ్ లోని స్టిల్ ఇప్పడు వైరల్ అవుతుంది.
ఎన్టీయే క్యూట్ లుక్స్ కు అంతా ఫిదా అవుతున్నారు.మీరు కూడా ఆ పిక్ చూసేయండి.







