తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రేపు బీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు పిలుపునిచ్చింది.ఉపాధి పనులపై కేంద్రం దుష్ప్రచారానికి వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించనుంది.
ఈ నేపథ్యంలో కేంద్రంపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.తెలంగాణపై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్నారు.
పంట కల్లాలను కడితే కేంద్రానికి ఎందుకు కడుపు మంట అని ప్రశ్నించారు.కల్లాలు నిర్మిస్తే మోదీ ప్రభుత్వం కళ్లలో నిప్పులు పోసుకుంటోందని విమర్శించారు.
ఉపాధి హామీ నిధుల మళ్లింపు అని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.వ్యవసాయ కల్లాలపై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు.
వ్యవసాయ రంగంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.రాష్ట్ర రైతుల ప్రగతిని ఓర్వలేకనే కేంద్రం కక్ష కట్టిందని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలోనే కేంద్రం కుట్రపూరిత చర్యలపై రేపు జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిచ్చినట్లు వెల్లడించారు.







