ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) వారాహి ఈ యాత్రలో భాగంగా మాట్లాడుతూ టాలీవుడ్ హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.తనకంటే ఎన్టీఆర్,ప్రభాస్ లాంటి హీరోలు చాలా గొప్పఅని ఎందుకంటే తనకన్నా ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నారు.
విషయం చెప్పడానికి తనకు ఎటువంటి అభ్యంతరము మొహమాటం లేదు అని తెలిపారు పవన్ కళ్యాణ్ నేను తోటి హీరోల సినిమాలను చూస్తాను ఈ విషయం చెప్పడానికి కూడా నాకు ఏమీ ఇగో లేదు అని తెలిపారు పవన్ కళ్యాణ్.ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ కి ఎన్టీఆర్ అభిమానులు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారు.

ఇదే విషయాన్ని ఎన్టీఆర్ ( Jr ntr )అభిమానులు తెలిపారు.ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ అభిమానులు అందరికి చెప్పుకొచ్చారు.వాళ్ళకి ఎన్టీఆర్ #ManOfMassesదగ్గర నుండి వర్తమానం అందింది అని తెలుస్తోంది.వారాహి రథాన్ని #VarahiYatra ఎక్కడా ఆపొద్దు, పవన్ కళ్యాణ్ కి రాజకీయంగా ఎటువంటి అడ్డంకులు కల్పించవద్దు అన్నది ఈ సందేశం.
అదే విషయాన్ని ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు ట్విట్టర్ లో అందరికీ చేరవేస్తున్నారు.మరి ఇతర హీరోలు అయిన, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి అభిమానులు ఏమి చేస్తారో చూడాలి మరి.

ఇకపోతే పవన్ కళ్యాణ్ విషయానికొస్తే పవన్ కళ్యాణ్ మొదటి వరకు వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడిపారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా బిజీబిజీగా ఉన్నారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉండగా అందులో బ్రో సినిమా( Bro moview )ను ఒక్కటే పూర్తి చేశారు పవన్.మిగిలిన మూడు సినిమాలు కూడా ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి.
అందులో హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికే ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమా ఇంకా వాయిదా పడుతూనే వస్తోంది.







