అభిమానం అదుపు దాటితే, అది మరో హీరోపైనే కాదు, ఇతర హీరోల అభిమానులపై కూడా ద్వేషం పెంచుకునేలా చేస్తుంది.సోషల్ మీడియా గొడవలు, థియేటర్ల వద్ద వాగ్వివాదాలు పాతబడిపోయి, ఇప్పుడు అభిమాన హీరో మీద అభిమానంతో మరో హీరో అభిమానిని చంపేసే స్థితికి దిగజారిపోయారు మన హీరోల ఫ్యాన్స్.తిరుపతికి చెందిన 24 ఏళ్ళ వినోద్ కుమార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని.ఇతను జనసేన పార్టి కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనే వాడు.కర్ణాటకలోని కొలార్ లో పవన్ ఫ్యాన్స్ నిర్వహించిన అవయవదాన కార్యక్రమానికి వినోద్ తన స్నేహితుడు త్రినాథ్ ని తీసుకోని వెళ్ళాడు.త్రినాథ్ ఆ కార్యక్రమం తన స్నేహితుడైన సునీల్ ని (ఎన్టీఆర్ ఫ్యాన్) ఆహ్వానించాడు.
ఆ కార్యక్రమంలో వినోద్ పవన్ కళ్యాణ్ కి జై కొట్టడం సునీల్ కి నచ్చలేదు.ఇద్దరి మధ్య గొడవైంది.ఆ తరువాత మిత్రులంతా పార్టి చేసుకుందామని నరసాపురంలోని ఓ హోటల్ కి వెళ్ళారు.అక్కడికి సునీల్ మిత్రుడైన అక్షయ్ కుమార్ (ఎన్టీఆర్ ఫ్యాన్) వచ్చాడు.
మళ్ళీ అక్కడ పవన్ – ఎన్టీఆర్ టాపిక్ మీద గొడవ జరిగింది.క్షణికావేశంలో అక్షయ్ కుమార్ కత్తితో వినోద్ గుండెపై కత్తితో పొడిచాడు.మిత్రులు త్రినాథ్, సునీల్ వినోద్ ని హాస్పిటల్ కి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు.నిందితుడు అక్షయ్ కుమార్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.







