ఆర్ఆర్ఆర్‌లో తారక్‌దే పీక్స్ అట!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

 Ntr Dialogues To Give Goosebumps In Rrr, Ntr, Rrr, Ram Charan, Rajamouli, Tollyw-TeluguStop.com

ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు.కాగా ఈ సినిమాలో ఈ హీరోలు చేసే యాక్షన్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా కొమురం భీం, సీతారామరాజు పాత్రలు చెప్పే డైలాగులు ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.అయితే కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ చెప్పే డైలాగులు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమట.

సాధారణంగానే తారక్ చెప్పే డైలాగులు ఎలా ఉంటాయో, ప్రేక్షకులకు తెలిసిందే.ఇక ఈ సినిమాలో తారక్‌తో దేశభక్తి డైలాగులు అదిరిపోయే రేంజ్‌లో చెప్పించాడట జక్కన్న.

ఈ డైలాగులు వింటే ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొదడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

ఏదేమైనా ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ చెప్పబోయే డైలాగులు ఎలాంటి రేంజ్‌లో ఉండబోతున్నాయో ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ చేస్తున్న హడావుడిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈ సినిమాలో తారక్ పర్ఫార్మెన్స్ కూడా ఓ రేంజ్‌లో ఉండటమే కాకుండా జక్కన్న దాన్ని మరింత పవర్‌ఫుల్‌గా చూపించేందుకు రెడీ అయ్యాడట.అటు చరణ్ పాత్ర కూడా ఏమాత్రం తగ్గకుండా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

మొత్తానికి ఆర్ఆర్ఆర్ చిత్రంలో తారక్ తన విశ్వరూపాన్ని చూపించనున్నాడనే టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube