ఎన్టీఆర్‌ 'దేవర' నుండి రాబోతున్న దసరా అప్డేట్‌ ఏంటో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ( koratala shiva ) దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం ‘దేవర’( Devara ).భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లో హీరోయిన్ గా బాలీవుడ్‌ హాట్ బ్యూటీ, అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.

 Ntr Devara Movie Dasara Festival Update , Dasara Festival, Ntr Devara, Ntr's Loo-TeluguStop.com

ఈ సినిమా లో ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్ ల జోడీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం తప్పకుండా ఈ సినిమా లో ఎన్టీఆర్‌ పాత్ర ఇంకా కథ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.అలా ఈ సినిమా పై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.

Telugu Devara, Koratala Shiva-Movie

వచ్చే ఏడాది సమ్మర్‌ లో సినిమా విడుదల కాబోతుంది.అయితే షూటింగ్ మాత్రం ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ వరకు పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ఈ సినిమా పై కొందరు ఎన్టీఆర్ అభిమానులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే కొరటాల గత చిత్రం ఆచార్య ఫలితం ఏంటో అందరికి బాగా తెలుసు.

అందుకే ఈ సినిమా విషయం లో కూడా చాలా మంది అనుమానంతో ఉన్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.భారీ అంచనాల నడుమ రూపొందిన ఆచార్య సినిమా ఫలితం తారు మారు అవ్వడంతో కొరటాల శివ ఏడాది సమయం తీసుకుని ఎన్టీఆర్‌ దేవర సినిమా ను మొదలు పెట్టాడు.

ఇక సినిమా ఫస్ట్‌ లుక్ మరియు టైటిల్‌ తో ఆకట్టుకున్నారు.

Telugu Devara, Koratala Shiva-Movie

కనుక ముందు ముందు సినిమా తో ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.దసరాకు ఎన్టీఆర్‌ లుక్ గ్లిమ్స్( NTR’s look glimmers ) ను విడుదల చేస్తారని తెలుస్తోంది.ఆ వీడియో తో సినిమా పై మరింతగా ఆసక్తి, అంచనాలు పెరగడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుకుంటున్నారు.

ఇక ఈ సినిమా దసరా అప్డేట్‌ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ హిందీ చిత్రం వార్ 2 లో నటించబోతున్న విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube