పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న సినిమా వినోదయ సీతమ్ రీమేక్ నేటి నుండి షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.ముందుగా అనుకున్నట్లు ఈ సినిమా వారం రోజుల క్రితమే అంటే ఫిబ్రవరి 14వ తారీఖున పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది, కానీ ఆ సమయం లో పవన్ కళ్యాణ్ అనారోగ్య కారణం వల్ల పూజా కార్యక్రమాలను నిర్వహించలేక పోయారు.
దాంతో డైరెక్ట్ షూటింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ తో పాటు ఈ సినిమా లో మెగా హీరో సాయి ధరంతేజ్ కూడా నటిస్తున్నాడు.సముద్రఖని దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా కు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన సహకారం అందించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.ఈ సినిమా ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు జీ స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ యొక్క లుక్ విభిన్నంగా ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.ఈ సినిమా ను దసరా కనకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కేవలం రెండు నెలల్లోనే చిత్రీకరణ పూర్తి చేయాలని భావిస్తున్నారు.పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ కలిసి నటించబోతున్న మొదటి సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

సినిమా ప్రారంభ కార్యక్రమాలు క్యాన్సల్ అయినా కూడా సినిమా ప్రారంభం షూటింగ్ ప్రారంభం అవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.ఇక ఎన్టీఆర్ సినిమా కూడా పూజా కార్యక్రమాలు నేడో రేపు అన్నట్లుగా జరగాల్సి ఉంది.కాని తారకరత్న మృతి చెందడంతో పూజా కార్యక్రమాలు క్యాన్సిల్ అయ్యాయి.మార్చి నెలలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.మొత్తానికి పవన్ కళ్యాణ్ మరియు ఎన్టీఆర్ సినిమాల యొక్క పూజా కార్యక్రమాలు క్యాన్సిల్ అవ్వడం.డైరెక్ట్ గా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లడం కాకతాళీయంగా జరిగాయి.







