యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR ) టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ”NTR30”. ఈ మధ్యనే గ్రాండ్ లాంచింగ్ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.
తారక్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూనే ఉన్నారు.మరి అన్ని అడ్డంకులను దాటుకుని ఎట్టకేలకు షూట్ పూర్తి చేసుకుంది.
ఇదిలా ఉండగా ఈ పాన్ ఇండియన్ సినిమా నుండి ఏదొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వస్తూనే ఉంది.తాజాగా మరో అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది.ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ పై వైరల్ అవుతున్న ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.ఈ సినిమాను కొరటాల( Koratala Siva ) చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేయాలనీ పక్కా ప్లాన్ చేసుకున్నాడని.
అందుకే ఈయన ఈ విషయంలో ఫుల్ క్లారిటీగా ఉన్నాడని తెలుస్తుంది.
అందుకే ఈ సినిమా (NTR30 ) షూట్ ను ఫాస్ట్ గా పూర్తి చేస్తూనే ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఆన్ టైం లో కంప్లీట్ చేయాలని చూస్తున్నారట.చూడాలి కొరటాల షూట్ ఎప్పటికి పూర్తి చేస్తాడో.ఇక ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.
అలాగే 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ ఉంటుంది అని ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.
అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ఢీ కొట్టబోయే విలన్ ఎవరు అని మొన్నటి వరకు కన్ఫ్యూజ్ అవుతున్న ఫ్యాన్స్ కు ఇటీవలే క్లారిటీ కూడా ఇచ్చారు.ఇందులో ఎన్టీఆర్ కు విలన్ గా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) కన్ఫర్మ్ అయ్యాడు.అలాగే హీరోయిన్ గా కూడా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ) నటిస్తుంది.
దీంతో ఈ సినిమాపై బాలీవుడ్ లో కూడా అంచనాలు పెరిగాయి.