యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young Tiger NTR ) హీరోగా రూపొందుతున్న దేవర సినిమా( Devara movie ) కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు స్పీడ్ గా జరుగుతున్నాయి.కానీ బయటకు చూడ మాత్రం అసలు దేవర సినిమా షూటింగ్ జరుగుతుందా.
ఆగిపోయిందా అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.సోషల్ మీడియాలో దేవర సినిమాకు సంబంధించిన హడావుడి లేక పోవడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ముందు ముందు దేవర సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.కానీ ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ సగానికి పైగా పూర్తి అయినా కూడా ఎలాంటి వీడియో కూడా విడుదల చేయక పోవడం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి దేవర సినిమా హడావుడి లేక పోవడం మంచిదే అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే సినిమా షూటింగ్ సమయం లోనే హైప్ పెరిగితే విడుదల సమయంకు పీక్స్ కి చేరుకుంటుంది.అందుకే ఇబ్బంది లేకుండా విడుదల సమయంలోనే సినిమా యొక్క హైప్ ని పెంచాలని భావిస్తున్నారు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే కచ్చితంగా దేవర సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవచ్చు.
కొరటాల శివ ఈ సినిమా విషయం లో తన ప్రాణం పెట్టి మరీ వర్క్ చేస్తున్నాడు అంటూ యూనిట్ సభ్యులు( Unit members ) అంటున్నారు.కనుక అతి గా పబ్లిసిటీ చేసి సినిమా కి మైనస్ చేయక పోవడం మంచిది అనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి దేవర సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించిన హడావుడి విడుదల సమయంలో చేస్తే చాలు.దేవర సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.
అంటే విడుదలకు ఇంకా నాలుగు నెలలకు ఎక్కువగానే ఉంది.కనుక ఇప్పటి నుండే హడావిడి అక్కర్లేదు అనేది ఫ్యాన్స్ అభిప్రాయం కూడా అంటూ సమాచారం అందుతోంది.