బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కార్యక్రమాలలో బిగ్ బాస్ (Bigg Boss) రియాలిటీ షో ఒకటి.ఈ కార్యక్రమం అన్ని భాషలలోనూ ప్రసారమవుతు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.
ఈ కార్యక్రమం తెలుగులో ఏడవ సీజన్ ప్రసారం కాబోతోంది.ఏడవ సీజన్లో భాగంగా 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
అయితే ఇప్పటికే ఈ కార్యక్రమం మూడు వారాలు పూర్తి చేసుకోవడంతో ముగ్గురు హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు.ఈ వారం మరొకరు ఎలిమినేట్ కానున్నారు.
ఇక హౌస్ లోకి కేవలం పదిమంది కంటెస్టెంట్లు ఉండటంతో హౌస్ లో పెద్దగా ఎంటర్టైన్ లేదని చెప్పాలి.
ఇలా కంటెస్టెంట్ లో సంఖ్య తక్కువగా ఉండటంతో వీరంతా ప్రేక్షకులను పెద్దగా సందడి చేయలేకపోతున్నారని తద్వారా ఈ షో రేటింగ్ ఎప్పటిలాగే తక్కువగానే వస్తున్నటువంటి నేపథ్యంలో మేకర్స్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగవ వారం పూర్తిచేసుకుని ఐదవ వారంలోకి అడుగుపెట్టే క్రమంలో వైల్డ్ కార్డు ఎంట్రీ (Wild Card Entry)ద్వారా ఏడుగురు కంటెస్టెంట్లను ఒకేసారి హౌస్ లోకి పంపించాలని నిర్వాహకులు ప్లాన్ చేశారట.ఇక వీరందరిని సెప్టెంబర్ 30వ తేదీ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పంపించడానికి అన్ని రంగం సిద్ధం చేశారని సమాచారం.
ఇక ఈ కార్యక్రమంలోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఏ ఏ కంటెస్టెంట్లు వెళ్లబోతున్నారనే విషయానికి వస్తే గతంలో వినిపించినటువంటి పేర్లే ఇప్పుడు వైల్డ్ కార్డు ద్వారా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.ఇందులో భాగంగా అంజలి, ( Anjali ) అంబటి అర్జున్,( Ambati Arjun ) యాంకర్ ప్రత్యూష,( Anchor Prathyusha ) సురేఖ వాణి కూతురు సుప్రీత, బోలో షవాళి, యాక్టర్ ఫర్జానా వంటి కొంతమంది పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.మరి నిజంగానే వీరంతా సెప్టెంబర్ 30 వ తేదీ వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? ఇక వీరు హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత అయినా తమ ఆటతీరుతో ప్రేక్షకులను మెప్పించేరా అనే విషయాలు తెలియాల్సి ఉంది.