ప్రస్తుతం ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దేవర”.ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఎన్టీఆర్( Jr ntr ) నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యింది.ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది ముగిసిన తారక్ మరో సినిమాను పూర్తి చేయలేక పోయాడు.
ఇటీవలే ఈ సినిమాను లాంచ్ చేసి షూటింగ్ స్టార్ట్ చేసారు.ఇక మే 20న తారక్ బర్త్ డే రోజు ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ చేయగా దేవర టైటిల్ కు భారీ రెస్పాన్స్ లభించింది.
ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకోగా తారక్ ను మాస్ హీరోగా చూపించబోతున్నాడు అని చెప్పకనే చెప్పాడు.ఇక కొరటాల ఇది పాన్ ఇండియన్ సినిమా కావడంతో అన్ని ఇండస్ట్రీలోని నటీనటులను ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే బాలీవుడ్( Bollywood ) తారాగణం భాగం కాగా అక్కడ కూడా అదిరిపోయే క్రేజ్ తెచ్చుకుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫిక్స్ కాగా సైఫ్ అలీ ఖాన్ విలన్( Saif Ali Khan ) గా నటిస్తున్నాడు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఇప్పుడు మరో కుర్ర హీరో నటించ బోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.అతడు మరెవరో కాదు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అని తెలుస్తుంది.

ఎన్టీఆర్ తమ్ముడి రోల్ లో ఈ హీరోను కొరటాల ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. విశ్వక్ సేన్( Vishwak Sen ) ఎన్టీఆర్ కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే.అందుకే చిన్న పాత్ర అయినా ఈ హీరో ఓకే చెప్పినట్టు టాక్.విశ్వక్ నటనను మెచ్చిన ఎన్టీఆర్ ఈ హీరోకు ఈ ఆఫర్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
మొత్తం 20 నిముషాల నిడివి ఉండే ఈ క్యారెక్టర్ కోసం విశ్వక్ ను ఓకే చేసారని.ఈయన క్యారెక్టర్ సినిమాలో చనిపోతుందని.అంతేకాదు సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది అని వైరల్ అవుతుంది.చూడాలి ఈ వార్తల్లో నిజమెంతో.







