'దేవర' షూట్ లేటెస్ట్ ఇన్ఫో ఇదే.. ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం భారీ సెట్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( Young Tiger NTR ) టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘‘దేవర”( Devara ).ఆర్ఆర్ఆర్ తర్వాత మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలని కసితో ఈ సినిమాను పట్టుదలగా పూర్తి చేస్తూ రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు.

 Ntr And Koratala Siva Devara Movie Latest Update, Devara , Ntr, Koratala S-TeluguStop.com

ఈయనతో పాటు కొరటాల శివ కూడా విజయం కోసం తపిస్తుండడంతో దేవర సినిమా ఎన్నో అంచనాలతో తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమా షూట్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎన్నో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

తాజాగా మరో రూమర్ వైరల్ అవుతుంది.ఈ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది.

ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం మేకర్స్ రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేయిస్తున్నారని ఈ సెట్ లోనే కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించనున్నారని ఈ సీక్వెన్స్ లో విజువల్స్ అద్భుతంగా ఉంటాయని అలాగే ఎన్టీఆర్ గెటప్ కూడా థ్రిల్లింగ్ గా ఆకట్టుకునేలా ఉంటుందని తెలుస్తుంది.

దీన్ని బట్టే కొరటాల దేవర కథ కోసం ఎన్ని కసరత్తులు చేసాడో అర్ధం అవుతుంది.కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తుండగా విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan ) నటిస్తున్నాడు.ఇక పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ఇక అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube