ఇన్నాళ్ల గ్యాప్‌ సరిపోలేదా ఎన్టీఆర్‌..?

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ అరవింద సమేత చిత్రం తర్వాత దాదాపు నాలుగు సంవత్సరాల గ్యాప్ వచ్చింది.జక్కన్న సినిమా అంటే ఆ మాత్రం గ్యాప్ కన్ఫర్మ్‌.

 Ntr And Koratala Shiva Ntr 30 Shooting Update , Koratala Shiva , Movie News ,-TeluguStop.com

పైగా కరోనా వల్ల ఇంకాస్త ఎక్కువే గ్యాప్‌ వచ్చింది.అనుకోకుండా వచ్చిన గ్యాప్ అయినా కూడా ఆర్‌ ఆర్‌ ఆర్‌ తో అద్బుతమైన విజయం ఎన్టీఆర్‌ కు దక్కింది.

అందుకే ఇక ముందు గ్యాప్ లేకుండా వరుసగా సినిమా లు చేయమంటూ అభిమానులు ఎన్టీఆర్‌ కు విజ్ఞప్తి చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్‌ తదుపరి సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

అదుగో ఇదుగో అంటూ ఎన్టీఆర్ 30 సినిమా వాయిదా పడుతూ వస్తోంది.రెండేళ్ల క్రితం కన్ఫర్మ్‌ అయిన ఎన్టీఆర్‌ 30 సినిమా ఇప్పుడు ఇంకా కూడా అదుగో ఇదుగో అంటూ ఉంటే అభిమానులు ఊరికే ఉంటారా… అసలు ఎన్టీఆర్‌ 30 వ సినిమా ఉందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

కొరటాల శివ ఆచార్య సినిమా విడుదల అయ్యే వరకు వెయిట్‌ చేయాల్సిందే అంటే మొన్నటి వరకు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆచార్య విడుదల అయ్యి నెలలు గడుస్తున్నా కూడా ఇంకా ఎన్టీఆర్‌ 30 ఊసే లేదు.

అసలు ఇలాంటి ఒక సినిమా ను ఇంతగా వెయిట్‌ చేయించాల్సిన అవసరం ఏంటీ అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.నెట్టింట యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినట్లుగా అరుస్తున్నారు.

అయినా కూడా వెయిటింగ్‌ చేయాల్సిందే అన్నట్లుగా ఎన్టీఆర్‌ చెబుతూ వస్తున్నాడు.ప్రస్తుతం ఎన్టీఆర్‌ సమ్మర్ వెకేషన్‌ ను విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు.

త్వరలోనే ఆయన ఇండియాకు తిరిగి వచ్చేలా ఉన్నాడు.అయినా కూడా వెంటనే సినిమా ను పట్టాలెక్కించే ఉద్దేశ్యం లేదు.

జులై లేదా ఆగస్టు వరకు వెయిట్‌ చేయాల్సిందే అంటూ ఎన్టీఆర్‌ సన్నిహితులు అంటున్నారు.కొరటాల శివ ఎప్పుడు చేయాలి… ప్రశాంత్‌ నీల్‌ సినిమా ఎప్పటికి ఉంటుందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

ఆర్ ఆర్‌ ఆర్‌ పేరు తో తీసుకున్న నాలుగు ఏళ్ల గ్యాప్‌ సరిపోలేదా అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube