కొరటాల శివకు రూ.500 కోట్ల స్థాయి ఉందా? ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ అత్యాశ

ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే.హీరో గా ఆర్ ఆర్ ఆర్‌ సినిమా తర్వాత ఎన్టీఆర్ స్థాయి అమాంతం పెరిగింది.

అద్భుతమైన పాన్ వరల్డ్ ఇమేజ్‌ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్‌( NTR ) ఇక పై ఏ సినిమా చేసినా కూడా మినిమంగా రూ.500 కోట్ల వసూళ్లు చేయాల్సిందే అన్నట్లుగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.పాన్ వరల్డ్‌ స్టార్‌ గా ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్‌ కు ఆ స్థాయి లో స్క్రిప్ట్‌ రెడీ చేయాల్సిన దర్శకులు కావాలంటూ కూడా అభిమానులు భావిస్తున్నారు.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఒక సినిమాను చేస్తున్నాడు.కొరటాల గత చిత్రం ఆచార్య నిరాశ పర్చింది.అంతకు ముందు ఆయన ఎన్టీఆర్‌ తో చేసిన జనతా గ్యారేజ్ ( Janata Garage )సినిమా కూడా ఆకట్టుకోలేక పోయింది.దాంతో ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమా హిట్ అయి రూ.500 కోట్ల వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్‌ 30( NTR 30 ) గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందబోతున్న కొరటాల శివ సినిమా యొక్క కలెక్షన్స్‌ ఎంత వరకు నమోదు అవుతాయి అనేది క్లారిటీ లేదు.కానీ కచ్చితంగా ఎన్టీఆర్‌ 30 సినిమా యొక్క వసూళ్ల విషయం లో అభిమానులు సంతృప్తి చెందే అవకాశం ఉందా అంటే కష్టమే అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.

కొరటాల శివ తో ఎన్టీఆర్‌ చేస్తున్న సినిమా ను పాన్‌ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తాం అంటూ మేకర్స్ ప్రకటించారు.కానీ అది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుంది అనేది చూడాలి.

Advertisement

ఆర్ ఆర్‌ ఆర్‌ వంటి బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్‌ మళ్లీ ఆ స్థాయి లో విజయాన్ని దక్కించుకోవడం అంటే దాదాపు అసాధ్యం.అయినా కూడా కొందరు మాత్రం ఎన్టీఆర్‌ 30 పై చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!
Advertisement

తాజా వార్తలు