యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు.సినిమా కాస్త ఆలస్యంగా విడుదలైన పర్వాలేదు, కానీ వెంటనే షూటింగ్ ప్రారంభించాలంటూ ఆయన అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇప్పటికే ఎన్టీఆర్ 30 సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.కొరటాల శివ దర్శకత్వంలో సినిమా రూపొందుతుంది అంటూ ప్రకటన విడుదల చేశారు.
కానీ కొరటాల శివ గత చిత్రం ఆచార్య నిరాశ పరచడంతో కచ్చితం గా కాస్త ఆలస్యం అవుతుందని మొన్నటి వరకు అనుకున్నారు.కానీ తాజగా అందుతున్న సమాచారం ప్రకారం కొరటాల శివ తయారు చేసిన స్క్రిప్టు ఏమాత్రం ఎన్టీఆర్ ని సంతృప్తి పరచలేక పోయిందట, దాంతో మళ్లీ స్క్రిప్ట్ పై కొరటాల శివ వర్క్ మొదలు పెట్టాడు అనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న పుకారు.

మొన్నటి వరకు దసరా కి సినిమా నుండి అప్డేట్ వస్తుంది.కచ్చితం గా ఒక సాలిడ్ అప్డేట్ దసరా కానుకగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం రాబోతుంది అంటూ రక రకాలుగా ప్రచారం జరిగింది.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ 30 వ సినిమా కు సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా దసరా కి రాబోవడం లేదు.ఎన్టీఆర్ 30 సినిమా దర్శకుడు మారే అవకాశాలు కూడా ఉన్నాయంటూ పుకార్లు, షికార్లు చేస్తున్నాయి.
ఆ విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.కొరటాల శివ కి మరో సారి అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్ ఈసారి కూడా స్క్రిప్ట్ విషయం లో సంతృప్తి పరచక పోతే బుచ్చి బాబు కి వెంటనే డేట్లు ఇచ్చే అవకాశం ఉందంటూ నందమూరి కాంపౌండ్ నుండి గుస గుసలు వినిపిస్తున్నాయి.
అది ఈ ఏడాది చివరి వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.వచ్చే ఏడాది లో ఎన్టీఆర్ 30 సినిమా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.