హాంకాంగ్‌లో స్థిరపడిన పంజాబ్‌కు చెందిన ప్రవాస భారతీయుడిపై సొంత రాష్ట్రంలోనే దాడి జరిగింది.అంతేకాకుండా దుండగులు ఆయనను భయభ్రాంతులకు గురిచేసేందుకు గాను గాలిలోకి కాల్పులు జరిపారు.
ఈ ఘటనకు సంబంధించి లూథియానాకు సమీపంలోని బర్నాలాకు చెందిన దీపిందర్ సింగ్, జాగ్రావ్‌కు చెందిన కుల్విందర్ సింగ్, మరో ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.బాధితుడిని ఇందర్‌జిత్ సింగ్‌గా గుర్తించారు.
నిందితులంతా తనకు మంచి స్నేహితులుని, తాను తరచుగా వారికి ఆర్ధిక సాయం చేసేవాడినని బాధిడుతు ఆవేదన వ్యక్తం చేశారు.
జనవరి 22న నిందితుల్లో ఇద్దరు తనకు ఫోన్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారని ఇందర్‌జిత్ సింగ్ తన ఫిర్యాదులో తెలిపారు.
ఇందుకు తాను నిరాకరించడంతో నిందితులు తనను, తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించారని వెల్లడించారు.తర్వాత ఐదుగురు వ్యక్తులతో కలిసి తన ఇంటికి వచ్చి దాడి చేశారని .భయపడిన తాను సేఫ్టీ అలారం ఆన్ చేయడంతో నిందితులు కారులో పారిపోయారని ఇందర్‌జిత్ సింగ్ ఆరోపించారు.

తాను ఈ ఘటనపై పోలీస్ సిబ్బందికి తెలియజేస్తుండగా.వారు మరోసారి తిరిగి వచ్చి తనను భయపెట్టడానికి గాలిలోకి కాల్పులు జరిపారని ఆయన తెలిపారు.దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకునేలోగా మలక్ చౌక్ వైపు పారిపోయారని ఇందర్‌జిత్ పేర్కొన్నారు.
దీనిపై స్థానిక డీఎస్పీ స్పందిస్తూ.నిందితులు ఇందర్‌జిత్ నుంచి బలవంతపు వసూళ్లు డిమాండ్ చేయలేదని, వీరిద్దిరి మధ్య పాత వివాదం వుందన్నారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని, దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు.

ఇదిలావుండగా.ఇదే లూథియానా నగరంలో గతవారం ఓ ఎన్ఆర్ఐపై 15 మంది యువకులు మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది.బాధితుడిని దీపక్ ఛబ్రాగా గుర్తించారు.
ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలవ్వడంతో దయానంద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చేర్చారు.ఇంగ్లాండ్‌లో స్థిరపడిన దీపక్ ఛబ్రా.
తన మేనకోడలి వివాహానికి హాజరయ్యేందుకు గాను లూథియానా వచ్చారు.ఇక్కడ పని ముగించుకుని జనవరి 24న ఆయన ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లాల్సి వుంది.
ఈ ప్రమాదంలో దీపక్ తలకు తీవ్రగాయాలయ్యాయని, ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే వున్నాడని బంధువులు చెబుతున్నారు.దీనిపై డివిజన్ నెంబర్ 1 పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
దాడికి పాల్పడిన రోహిత్, అనీష్ భోలు, గగన్, అమన్ గోయల్, రోహిత్ వారి అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.