అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం ప్రేమలో ఉన్నాడు అంటూ దాదాపుగా కన్ఫామ్ అయ్యింది.సమంత ని ప్రేమ వివాహం చేసుకొని కొన్నాళ్ల తర్వాత విడాకులు ఇచ్చిన నాగ చైతన్య ఇప్పుడు హీరోయిన్ శోభిత ధూళిపాల తో సహజీవనం చేస్తున్నాడు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఆ మధ్య తాము ఇద్దరం మంచి స్నేహితుల మాత్రమే అంటూ శోభిత కామెంట్స్ చేసింది.ఆ విషయంలో అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్పందిస్తూ ప్రస్తుతం నాగ చైతన్య ఎవరితోనూ రిలేషన్ లో లేడు.
కచ్చితం గా అతడు కాస్త గ్యాప్ తీసుకుని కొత్త అడుగు వేస్తాడని తాము భావిస్తున్నాము అంటూ ఒకానొక సందర్భం లో చెప్పుకొచ్చారు. అఖిల్ విషయం లో ఎలా అయితే జరిగిందో నాగ చైతన్య విషయం లో కూడా అలాగే జరుగుతుంది అంటూ కొందరు మాట్లాడుకున్నారు.
కానీ అఖిల్ పెళ్లి బ్రేకప్ అయిన తర్వాత మళ్లీ ప్రేమ లో పడలేదు.కానీ నాగ చైతన్య మాత్రం శోభిత తో ప్రేమలో పడ్డట్లుగా దాదాపుగా కన్ఫర్మ్ అయింది.
ఇటీవల వీరిద్దరూ విదేశీ ప్రయాణం కలిసి చేయడం తో సహజీవనం ఖాయం అన్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.బెంగళూరు లేదా ముంబై లో వీరిద్దరూ కలిసి ఉంటున్నారని షూటింగ్స్ లేదా మరి ఏదైనా కారణం ఉన్నప్పుడు హైదరాబాద్ కి వస్తున్నారని ఇండస్ట్రీ కి చెందిన కొందరు చాలా నమ్మకం గా చెబుతున్నారు.గతం లో అక్కినేని ఫ్యామిలీ మా నాగ చైతన్య అలాంటి వాడు కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు.మరి ఇప్పుడు అదే నాగ చైతన్య గురించి అక్కినేని ఫ్యామిలీ వారు ఏమంటారు అనేది చూడాలి.
ఇక నాగచైతన్య సినిమా ల విషయానికి వస్తే తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం లో కస్టడీ అనే సినిమా ను చేస్తున్న విషయం తెలిసిందే.ఆ సినిమా కు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
దానికి మంచి రెస్పాన్స్ కూడా దక్కింది.