శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం నవంబర్ కోటా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.నవంబర్ నెలకు సంబంధించిన ప్రత్యక ప్రవేశ దర్శనం టికెట్లతో పాటు ఆర్జిత సేవ, అంగ ప్రదక్షిణ టికెట్లను ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది.
అదేవిధంగా నవంబర్ నెలలో స్వామివారికి నిర్వహించనున్న కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, ఊంజల్ సేవ, ఆర్జిత సేవా టికెట్లను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి తీసుకురానుంది.







