మాంసాహార ప్రియులకు అన్నిటికంటే చికెన్ మహా ఇష్టం.చికెన్ తినకుండా మాంసాహార ప్రియులు అసలు ఉండలేరు.
మాంసాహార ప్రియులను మరింతగా ఆకట్టుకునేందుకు ఇప్పటికే ఎందరో వంట మనుషులు ఎన్నో రకాల చికెన్ రెసిపీలు కనిపెట్టారు.అయితే తాజాగా జస్టిన్ తామటన్ అనే వ్యక్తి కనిపెట్టిన మరొక చికెన్ డిష్ ఇప్పుడు అందరినీ నోరూరిస్తోంది.
ఆ చికెన్ డిష్ ఎలా తయారు చేయాలో కూడా అతడు ఒక వీడియోలో వివరించాడు.దీంతో దీన్ని చాలా మంది నెటిజన్లు షేర్ చేస్తున్నారు.
అలా ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.ఇంతకీ ఆ రెసిపీ ఎలా చేసాడో ఇప్పుడు తెలుసుకుందాం.
జస్టిన్ ఇప్పటి వరకూ ఎవరూ చేయని విధంగా ఒక చికెన్ వెరైటీ చేశాడు.ఈ రెసిపీలో పిండిని వాడటం విశేషం.
ఈ డిష్ లో అతను కొంత పిండి తీసుకొని అందులో చికెన్ యాడ్ చేసి అనంతరం వాటిని ఫ్రై చేశాడు.అయితే దీనికంటే ముందు జస్టిన్ తన బార్బెక్యూ గ్రిల్‌లో స్మోకీ ఫ్లేవర్‌ని అందించడానికి పొడి పిండిని ఉంచి కాల్చాడు.
అలా పొగ తగిలేలా పిండిని కాల్చిన తర్వాత దానికి మసాలాలు యాడ్ చేసి అందులో చికెన్ ముంచి వాటిని సలసల కాగే నూనెలో వేయించాడు.పిండిలో కలపక ముందు చికెన్ ముక్కలను బట్టర్ మిల్క్‌లో కాసేపు నాన బెట్టాడు కూడా.
అలా చాలా వెరైటీగా ఈ వంటకాన్ని వండాడు.అయితే చూసేందుకు ఇది చాలా రుచికరంగా కనిపించింది.
జస్టిన్ దీన్ని టేస్ట్ చేసి ఇది చాలా బాగుందని చెప్పడం కూడా మీరు వీడియోలో చూడొచ్చు.
ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ వీడియోకి 3.7 మిలియన్ల పైగా వ్యూస్, రెండు లక్షల వరకు లైకులు వచ్చాయి.ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.
వీడియోలో ఈ డిష్ ఎలా తయారు చేశారో ఒకటికి రెండుసార్లు చూసి దీనిని మీరు కూడా ఇంటి వద్ద ట్రై చేయవచ్చు.