CRPF లో 9212 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..!

CRPF లో 9212 కానిస్టేబుల్ పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ మార్చి 27 న ప్రారంభమై ఏప్రిల్ 24 న ముగుస్తుంది.అభ్యర్థులు www.crpf.gov.in లో సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.9212 కానిస్టేబుల్ పోస్టులలో పురుషులకు 9105 పోస్టులు, మహిళలకు 107 పోస్టులు ఉన్నాయి.అయితే పోస్టులలో అర్హత ప్రమాణాలు, వయోపరిమితి చాలా వేరువేరుగా ఉన్నాయి.పురుషులకు సంబంధించి మోటార్ మెకానిక్, డ్రైవర్, కొబ్లర్ , కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్రాండ్, గార్డెనర్, కుక్, పెయింటర్, వాషర్ మన్, బార్బర్, వాటర్ క్యారియర్, సఫాయి కర్మకారి పోస్టులు భర్తీ చేయనున్నారు.

 Notification For 9212 Constable Posts In Crpf Application Process Has Started-TeluguStop.com

మహిళల విషయానికొస్తే బ్రాస్ బ్యాండ్, సఫాయి కర్మచారి, హెయిర్ డ్రస్సర్, వాషర్ వుమెన్, వాటర్ క్యాషియర్, కుక్, బగ్లర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.

పరీక్ష ఫీజు రూ.100 చెల్లించవలెను.ఎస్సీ, ఎస్టీ ( SC, ST )అభ్యర్థులకు, అన్ని కేటగిరీల మహిళలకు, మాజీ సైనికులకు ఫీజు మినహాయింపు ఉంది.పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు పే లెవెల్ 3 ప్రకారం రూ.21,700 -69,100 పొందుతారు.CRPF అడ్మిట్ కార్డు జూన్ 20 నుంచి జూన్ 25 లోపు సంబంధిత వెబ్సైట్ నుండి పొందవచ్చు.పరీక్ష విధానానికి వస్తే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్( Physical Efficiency Test, Trade Test ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ల ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక కోసం జూలై 1 నుండి జులై 13 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించబడుతుంది.దరఖాస్తు ప్రక్రియలో ముందుగా CRPF అధికారిక వెబ్సైట్లో, రిక్రూట్మెంట్ లింక్ పై క్లిక్ చేసి అన్ని వివరాలు పూరించి సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయాలి.

వివరాలన్నీ సరిచూసుకొని ఫైనల్ సబ్మిట్ చేసి, భవిష్యత్తు అవసరాల కోసం ఆ దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసి భద్రపరచుకోవాలి.అర్హులైన అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube