దిగ్గజ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ తెస్తూ వినియోగదారులను బాగా ఎంకరేజ్ చేస్తుంది.ఈ క్రమంలోనే ఇటీవల చాలా ముఖ్యమైన అప్డేట్స్ ని పరిచయం చేసింది.
వాట్సాప్ బీటా లో మాత్రమే వచ్చే ఫీచర్లు, అలాగే వినియోగదారులకు అందరికి అందుబాటులో ఉన్న ఫీచర్ల గురించి ఇపుడు తెలుసుకుందాం.ఈ లిస్టులో చాట్ లాక్, ఎడిట్ బటన్, HD ఫోటోలు, స్క్రీన్ షేరింగ్ మరియు మరిన్ని ఫీచర్లు అందరికీ అందుబాటులోకి వచ్చాయని మీలో ఎంతమందికి తెలుసు?

మొదట “చాట్ లాక్( Chat Lock )” విషయానికొస్తే, వాట్సాప్ ఇటీవలే మీ పర్సనల్ చాట్‌లను లాక్ చేయగల మంచి సెక్యూరిటీ ఫీచర్ని తీసుకు వచ్చింది.ఇది వినియోగదారులకు ఎంతగానో ఉపకరిస్తుంది.అదేవిధంగా “HD ఫోటోలు” పంపే కొత్త ఫీచర్ ఒకదానిని వాట్సాప్ పరిచయం చేశాడని మీకు తెలుసా? అవును, ఇటీవలే అధిక నాణ్యత గల ఫోటోలను మీమీ ఫ్రెండ్స్ కి పంపడానికి వీలుగా ఓ ఆప్షన్ ను అందించింది.ఇపుడు మీరు ఒరిజినల్ రిజల్యూషన్ ఫోటోలను వాట్సాప్ ద్వారా పంపవచ్చు.అదేవిధంగా మీరు “ఆన్‌లైన్లో వున్న విషయం ఎదుటివారికి కనపడకుండా దాచే ఫీచర్” కూడా ఇపుడు అందుబాటులోకి వచ్చేసింది.
ఈ ఫీచర్ వలన మీకు ప్రైవసీ ప్రాబ్లెమ్ ఉండదు.

అదేవిధంగా “ఒకే వాట్సాప్ ఖాతా ఇతర ఫోన్లలో” కూడా వాడుకొనే విధంగా ఓ ఫీచర్ ఈమధ్యే వచ్చింది.ఈ ఫీచర్ మీరు వాట్సాప్ వెబ్‌ని ఎలా ఉపయోగిస్తారో అలాగే పని చేస్తుందని చెప్పుకోవచ్చు.అలాగే “మెసెజ్ ఎడిట్ ఫీచర్“( Edit Message ) అనే అద్భుతమైన ఫీచర్ని వాట్సాప్ తీసుకువచ్చింది.
మీరు పంపిన వాట్సాప్ మెసెజ్ లను ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు.ఇక్కడ గమనించాల్సిందేమంటే మీరు మెసెజ్ పంపిన 15 నిమిషాలలోపు మాత్రమే టెక్స్ట్‌లను ఎడిట్ చేయగలరు.ఇక చివరగా మనం “స్క్రీన్ షేరింగ్ ఫీచర్“( Screen sharing ) గురించి మాట్లాడుకోవాలి.వాట్సాప్ వీడియో కాల్‌ల సమయంలో వారి ఫోన్ స్క్రీన్‌ను షేర్ చేసుకోవడానికి వినియోగదారులను అనుమతించడానికి ఈ కొత్త ఫీచర్ విడుదల చేసింది.
దీనిద్వారా వాట్సాప్ వినియోగదారులు డాక్యుమెంట్‌లు, షోకేస్ ప్రెజెంటేషన్‌లు వంటివి తేలికగా చేసుకోవచ్చు.కాబట్టి ఒకసారి ఇవన్నీ ట్రై చేసి చూడండి!