ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసుపై( Amit Shah Fake Video Case ) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఢిల్లీ పోలీసులకు( Delhi Police ) సమాధానం ఇచ్చారు.

ఫేక్ వీడియో షేర్ తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

ఐఎన్సీ తెలంగాణ ట్విట్టర్ ఖాతాను తాను నిర్వహించడం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు.ఈ మేరకు సమాచారాన్ని ఢిల్లీ పోలీసులకు రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది అందించారు.

అయితే అమిత్ షా ఫేక్ వీడియో కేసుపై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఫేక్ వీడియోను కాంగ్రెస్( Congress ) వైరల్ చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు పలువురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు అందించారు.

ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసుల నోటీసులకు రేవంత్ రెడ్డి సమాధానం పంపారు.

Advertisement
2024లో టాలీవుడ్ ను ముంచేసిన డిజాస్టర్లు ఇవే.. ఈ హీరోల కెరీర్ కు కష్టమేనా?

తాజా వార్తలు