సోషల్ మీడియా( Social media ) వేదికగా రోజు అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉండడం గమనిస్తూనే ఉంటాం.అందులో కొన్ని ఫన్నీ వీడియోస్ ఉండగా.
మరికొన్ని ఆహారానికి సంబంధించి, జంతువులకు సంబంధించి లాంటి వివిధ రకాల వీడియోస్ కనపడుతూ ఉంటాయి.సోషల్ మీడియాలో ఓ వీడియో ప్రస్తుతం కాస్త వైరల్ గా మారింది.
ఈ వీడియో చూసిన నెటిజన్స్ దాని పైన పెద్ద చర్చలనే జరుపుతున్నారు.కాకపోతే ఈ చర్చలు ఎందుకు.? ఇంతకీ మ్యాటర్ ఏంటి.? ఆ వీడియోలో ఏముందని అనుకుంటున్నారా.? అయితే ఈ వీడియో చూసేద్దామా.
పంట ఏదైనా సరే దాన్ని పండించడానికి కచ్చితంగా విత్తనాలు అవసరం.విత్తనాన్ని భూమిలో నాటి నీరు పోసి పెంచితేనే మనం తినడానికి ఏ ఆహారమైన లభిస్తుంది.ఇక ప్రస్తుతం వీడియోని చూస్తే అందులో పుచ్చకాయల్ని ఓ మెషిన్ లో వేస్తే అది వాటిని చకచక క్రష్ చేస్తుంది.
పుచ్చకాయ( Watermelon )ను అలా వేసేమో లేదో జ్యూస్ అలా బయటికి పంపించేస్తుంది.ఈ వీడియోను చూసిన వెంటనే అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అక్కడ ఎంత ఆహార పదార్థం వేస్ట్ అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు నెటిజన్స్.
ఇలా ఉండగా కామెంట్స్ లో ఓ వ్యక్తి ఆ మిషన్ నుండి పుచ్చకాయల్లో విత్తనాలను( Watermelon Seeds ) తీసుకుంటున్నట్లు కామెంట్ చేయగా.కొందరు దానిపై విమర్శలు గుప్పించారు.మరొకరైతే సీడ్ లెస్ వాటర్ మిలన్ యొక్క సీడ్స్ తీయడానికి ఇలా చేసి ఉంటారని అంటున్నారు.కొందరు మాత్రం అక్కడ చాలా పోషక విలువలు కూడిన పదార్థం వృధాగా పోతుందని సీరియస్ అవుతున్నారు.
అలా పుచ్చకాయ జ్యూస్ వేస్ట్ చేసే బదులు ఆకలి ఉన్నవారికి పంచిపెడితే ఆకలి తీరుతుంది కదా అంటూ అనేవారు కూడా లేకపోలేదు.ఏదేమైనా పంట సాగు చేసి అమ్ముకోవడం తెలిసినవాళ్లు ఇవన్నీ ఆలోచించరని మరొకరు కామెంట్ రూపంలో తెలిపారు.