Nora Fatehi : నరేంద్ర మోడీకి థాంక్స్ చెప్పిన నోరా ఫతేహి.. కారణం అదే?

బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ నోరా ఫతేహి( Nora Fatehi ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.

ఈమె సినిమాలలో హీరోయిన్ గా కంటే ఐటెం సాంగ్స్ ద్వారానే బాగా పాపులారిటీ సంపాదించుకుంది.ఇక తెలుగులో ఎన్టీఆర్ సరసన ఇట్టాగ రెచ్చి పోదాం అంటూ రెచ్చిపోయి చిందులు వేసింది.

ఆ తర్వాత హిందీలో దిల్ బర్ సాంగ్ తో ఒక ఊపు ఊపేసింది.కొద్దిరోజుల పాటు ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన విషయం తెలిసిందే.

ఆ సంగతి పక్కన పెడితే తాజాగా నోరా ఫతేహి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ( PM Narendra Modi )కి కృతజ్ఞతలు తెలిపింది.అసలేం జరిగిందంటే.ఇటీవల మొరాకోలో అర్థరాత్రి భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.

Advertisement

ఈ ఘటనతో ఒకసారిగా మొరాకో అంత దద్దరిల్లిపోయింది.ఈ భూకంపం మొరాకో అంతటా విధ్వంసం సృష్టించింది.

రాబాట్ కాసాబ్లాంకాతో సహా అనేక మొరాకో నగరాల్లో సంభవించిన భూకంపం కారణంగా ఇప్పటివరకు దాదాపుగా 2000 మందికి పైగా మరణించగా, మరో 1400మందికి పైగా పరిస్థితి విషయంగా ఉంది.మొరాకో మూలాలు కలిగిన నోరా భూకంపం( Morocco Earth Quake )తో నష్టపోయిన మొరాకో దేశానికి సాయం చేస్తామన్న హామీపై సంతోషం వ్యక్తం చేశారు.

మెరాకో( Morocco )లో తీవ్ర భూకంపం సంభవించిన తర్వాత ప్రధాని మోదీ ఓ ట్వీట్ లో.తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం.క్షతగాత్రులు వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

ఈ క్లిష్ట సమయంలో మొరాకోకు అన్ని విధాలా సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందంటూ ట్వీట్ చేసారు.అయితే ఆ ట్వీట్ పై స్పందించిన నోరా ఫతేహి మోదీ ట్వీట్ ను ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

ఈ గొప్ప మద్దతుకి ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు! అవగాహన పెంచడానికి సహాయం చేయడానికి ముందుండే దేశాలలో మీరు ఒకరు, మొరాకన్లు చాలా కృతజ్ణులు,ధన్యులు! జై హింద్ అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు