నూకరాజు ఆసియా జోడీ గురించి ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.బుల్లితెరపై మంచి గుర్తింపును సొంతం చేసుకున్న జోడీలలో ఈ జోడీ కూడా ఒకటి.
ఈ జోడీ పెళ్లికి సంబంధించి ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి.పటాస్ షో ద్వారా కెరీర్ ను మొదలుపెట్టిన నూకరాజు అంతకంతకూ ఎదిగి మంచి కమెడియన్ గా పాపులర్ అయ్యారు.
కొన్ని టాలీవుడ్ సినిమాలలో మెరిసిన నూకరాజు అభినయ ప్రధాన పాత్రల్లో కూడా అద్భుతంగా చేయగలరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
కొన్ని నెలల క్రితం కియా కంపెనీ కారును నూకరాజు ఆసియాకు బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే.
త్వరలోనే నూకరాజు ఆసియా పెళ్లికి సంబంధించిన శుభవార్త చెబుతారని ఫ్యాన్స్ అనుకున్నారు.అయితే తాజాగా జబర్దస్త్ షో ప్రోమో రిలీజ్ కాగా ఆ ప్రోమోలో నూకరాజు తల్లీదండ్రులు చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
ఈ నెల 19వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
ఈ ప్రోమోలో నూకరాజు ఆసియా చేతులు పట్టుకుని ఏదైనా మాట్లాడొచ్చు కదా అని అడగగా ఆసియా వెంటనే నీ కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడలేను రాజు అంటూ సమాధానం ఇస్తుంది.నువ్వు ఏదైనా మాట్లాడొచ్చు కదా అని ఆసియా అడగగా నీ కళ్లలో కళ్లు పెట్టి చూస్తే మాటలు రావడం లేదని నూకరాజు సమాధానం ఇస్తాడు.కృష్ణ భగవాన్ వెంటనే అయితే వెనక్కు వెళ్లి కూర్చోండి అంటూ కామెంట్ చేశారు.
ఆ తర్వాత జబర్దస్త్ షోలోకి నూకరాజు తండ్రి ఎంట్రీ ఇచ్చి డీజే టిల్లు సాంగ్ పేరడీ వెర్షన్ ను అద్భుతంగా పాడారు.నూకరాజు తల్లి మాట్లాడుతూ స్కిట్ వరకు నూకరాజు ఆసియాలకు నిశ్చితార్థం అంటే అంగీకరించామని నిజంగా అయితే ఇది కుదరదని ఆమె చెప్పుకొచ్చారు.ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇలాంటి ప్రోమోలు చాలానే చూశామంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.