ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు( AP Elections ) జరగనున్నాయి.దీంతో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు రకరకాల కార్యక్రమాలలో నిమగ్నమయ్యాయి.
ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) ఒంటరిగా పోటీకి దిగనుంది.ఇదే సమయంలో “సిద్ధం”( Siddham ) సభలతో ప్రచారం నిర్వహిస్తూ ఉంది.
మరోపక్క టీడీపీ జనసేన పార్టీలు కూటమి ఏర్పాటు చేయడం జరిగింది.ఇదే సమయంలో “రా కదలిరా”( TDP Raa Kadali Raa ) సభలతో చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే బుధవారం ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ భీమా చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మాట్లాడుతూ. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.సీఎం జగన్ ఈ రకమైన తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు.
తాము అధికారంలోకి వస్తే మరింత సంక్షేమం( Welfare Schemes ) ఇస్తామే తప్ప ప్రస్తుత పథకాలను ఆపేది ఉండదని వెల్లడించారు.రాష్ట్ర ప్రజలకు తన జేబులో నుంచి ఒక్క పైసా కూడా ఇవ్వని వ్యక్తి సీఎం జగన్( YS Jagan ) అని విమర్శించారు.
నా సంపాదన ప్రజలకు పంచేందుకు ఎప్పుడు సిద్ధంగానే ఉంటానని పవన్ అన్నారు.తమ కూటమి అధికారంలోకి వస్తే ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా పనిచేస్తాం.ఈసారి జరగబోయే ఎన్నికలలో జనసేన టీడీపీ కూటమిని ఆశీర్వదించండి అని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.