మూడేళ్ల వైసిపి పాలనలో ప్రజలు ఎవ్వరూ సంతోషంగా లేరు పదవులు పొందిన కొంతమంది మాత్రమే సంబరాలు చేసుకున్నారు లక్షా 42వేల కోట్ల రూపాయలు ను వివిధ పధకాల కింద పంచారు రాష్ట్ర అభివృద్ధి ని మాత్రం పూర్తిగా విస్మరించారు పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఎపిలో అన్నీ ధరలు ఎక్కువే ఆటో వాలాకి పది వేలు వేసి రెట్టింపు వసూళ్లు చేస్తున్నారు ఈ మూడేళ్లల్లో ఒక్క రంగంలో అయినా అభివృద్ధి ఉందా పోలవరం ప్రాజెక్టు విషయంలో మాట తప్పావు కేంద్రాన్ని కనీసం అడిగే ధైర్యం కూడా జగన్ కి లేదు కేటిఆర్ ఒక మంత్రి మాత్రమే… నువ్వు సిఎం హోదాలో దావోస్ వెళ్లావు కేటిఆర్ వెంట పారిశ్రామిక వేత్త లు క్యూలు కడుతున్నారు నిజంగా జగన్ నువ్వు సిగ్గు పడాలి మీ పార్టీ ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేశాడు.
మీ వాళ్లు సిగ్గు లేకుండా సమర్ధించుకుంటారాబస్సు యాత్ర లతో ప్రజలకు ప్రయోజనం ఏమిటి అంబేద్కర్ పేరును ఉద్దేశపూర్వకంగా వివాదం చేశారు అన్ని జిల్లాలకు పేర్లు పెట్టినప్పుడే అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టలేదు నువ్వు అభినవ అంబేద్కర్ అనిపించుకోవడానికి సిగ్గుందా తండ్రి పేరు పెట్టిన జిల్లాకు కడప పేరు ఎందుకు తొలగించావు మీ కుట్ర, కుతంత్రాలతోనే కోనసీమ లొ కుల ఘర్షణలు మంత్రులు బస్సు యాత్ర లకు తప్ప… ఇంకేమీ చేయలేరు ఇప్పుడు ఉన్న మంత్రులు అందరూ డమ్మీలు అమరావతి లో 40వేల మంది కార్మికులు పనిచేసే వాళ్లు జగన్ సిఎం అయ్యాక కేవలం కాపలా వాళ్లు మాత్రమే మిగిలారు జగన్ అభివృద్ధి నిరోధకుడిగా పేరు సార్ధకం చేసుకున్నాడు ఒక్క అప్పుల విషయంలో మాత్రమే జగన్ అభివృద్ధి సాధించాడు విభజన సమయంలో ఎంత అప్పు, చంద్రబాబు హయాంలో ఎంత, జగన్ హయాంలొ ఎంత అప్పు అనేది శ్వేత పత్రం విడుదల చేయాలి దీని పై అన్ని వర్గాల వారిని ఆహ్వానించి త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం
.