ఈ ఏడాది సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సినిమాలలో ఒకటి సూపర్ స్టార్ రజినీకాంత్( Superstar Rajinikanth ) హీరో గా నటించిన ‘జైలర్’.( Jailor ) వరుస ఫ్లాపులతో కెరీర్ లో ఎన్నడూ చూడని వరస్ట్ పీరియడ్ ని చూసిన రజినీకాంత్, ఇక రిటైర్ అయ్యేలోపు అయినా హిట్ కొడతాడా లేదా అని అందరూ అనుకున్నారు.అభిమానులు సైతం ఆశలు వదిలేసుకున్నారు.కానీ ఎవ్వరూ ఉహిచని రీతిలో రజినీకాంత్ జైలర్ చిత్రం తో బాక్స్ ఆఫీస్ సెన్సేషన్ ని సృష్టించి, 650 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టాడు.
ఈ మూవీ రికార్డ్స్ ని అతి తేలికగా క్రాస్ చేస్తుంది అనుకున్న విజయ్ ‘లియో’( Leo ) చిత్రం కూడా క్రాస్ చెయ్యలేకపోయింది అంటే ఇది ఏ స్థాయి బ్లాక్ బస్టర్ హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు.కేవలం థియేటర్స్ లో మాత్రమే కాదు, ఓటీటీ( OTT ) లో కూడా ఈ చిత్రం కళ్ళు చెదిరే రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.
అమెజాన్ ప్రైమ్ ( Amazon Prime )లో సెప్టెంబర్ 7 వ తారీఖున స్ట్రీమింగ్ అయిన ఈ చిత్రం అప్పటి నుండి నేటి వరకు వరుసగా రెండు నెలలు నాన్ స్టాప్ గా టాప్ 10 స్థానాల్లో ట్రెండ్ అవుతుంది.ఈ గ్యాప్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు విడుదల అయ్యాయి, అలా కొత్త సినిమాలు విడుదల అయ్యే కొద్దీ ట్రెండ్స్ మ్యాప్ లో నుండి తొలగిపోవడం సర్వసాధారణం, కానీ ఇప్పటి వరకు జైలర్ కి అలా జరగలేదు.నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతూనే ఉంది.ఈ స్థాయిలో ఒక సినిమా ట్రెండ్ అవ్వడం అనేది ఈమధ్య కాలం లో జరగలేదు.#RRR చిత్రం తర్వాత అలా ‘జైలర్’ చిత్రానికే జరిగింది.ఇంకా ఎన్ని రోజులు ఇలా ట్రెండ్ అవుతుందో చూడాలి.
#RRR చిత్రం నెట్ ఫ్లిక్స్ లో సుమారుగా 11 వారాలు నాన్ స్టాప్ గా ట్రెండ్ అయ్యింది.
‘జైలర్’ చిత్రం ఇప్పటి వరకు అలా 8 వారాలు ట్రెండ్ అయ్యింది, ఇంకా అవుతూనే ఉంది.విశేషం ఏమిటంటే, రీసెంట్ గా కొత్త సినిమాలు వరుసగా విడుదల అయ్యినప్పటికీ కూడా ‘జైలర్’ చిత్రం 5 వ స్థానం లో కొనసాగడమే విశేషం.ఇంకో నెల రోజులు నాన్ స్టాప్ గా ట్రెండ్ అయితే అమెజాన్ ప్రైమ్ లో అత్యధిక వ్యూస్ ని సాధించిన సినిమాగా నెంబర్ 1 స్థానం లో నిలుస్తుంది జైలర్.
మరి ఆ రేంజ్ కి వెళ్తుందో లేదో చూడాలి.ప్రస్తుతం సౌత్ నుండి అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న సినిమాగా ‘వకీల్ సాబ్’ నిల్చింది.ఇప్పుడు ఆ రికార్డు దాదాపుగా డేంజర్ లో పడినట్టే.