ఏపీ మంత్రి రోజా భర్త సెల్వమణికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది.పరువు నష్టం కేసులో చెన్నై జార్జ్ టౌన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిందని తెలుస్తోంది.
ఓ ఇంటర్వ్యూలో భాగంగా సెల్వమణి తన పరువుకు భంగం కలిగించే విధంగా మాట్లాడారని ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోత్రా 2016వ సంవత్సరంలో కేసు వేశారు.ఈ క్రమంలోనే ముకుంద్ చంద్ మరణం తరువాత ఆయన కుమారుడు గగన్ బోత్రా కేసును కొనసాగిస్తున్నారు.
అయితే తాజాగా వచ్చిన కోర్టు వాయిదాకు సెల్వమణి, ఆయన న్యాయవాదులు గైర్హాజరు అయ్యారు.ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం సెల్వమణికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
అనంతరం కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది.