ప్రపంచంలోని ఏ శక్తి భారత ప్రజాస్వామ్యన్ని ముట్టుకోలేదు: ప్రధాని

శతాబ్దాల చరిత్ర గల భారత ప్రజాస్వామ్యాన్ని ఏ శక్తి దెబ్బతీయలేదని.ఇది ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది అని ప్రధాని మోదీ అన్నారు.

 No Power In The World Can Touch Indian Democracy Pm, Modi, Bjp ,karnataka , Rahu-TeluguStop.com

కర్ణాటకలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మోడీ ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలకు సుతిమెత్తగా చురకలాంటించారు.భారత ప్రజాస్వామ్యం(Indian democracy) అతి ప్రాచీనమైనదని అయితే దీనిని అవమానించే ప్రయత్నం కొంతమంది లండన్ వేదికగా చేశారని ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా భారత ప్రజాస్వామ్య వారసత్వం చెక్కుచెదరని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు.

Telugu Dharwad, Karnataka, Rahul Democracy, Rahul Gandhi-Telugu Political News

ధార్వాడలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్ తో పాటు ప్రపంచంలోనే అతిపెద్దదైన రైల్వే ప్లాట్ఫారం సిద్ధరూడ రైల్వే ప్లాట్ ఫామ్(Siddaruda Railway Platform) ని ప్రారంభిస్తూ ఆయన బహిరంగ సభలో ప్రసంగించారు….బాజాపా ప్రభుత్వం అభివృద్ధికి నమూనా లాంటిదని ఆయన తెలిపారు.కర్ణాటకలోని ప్రతి గ్రామాన్ని, ప్రతి మండలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత భాజపా ప్రభుత్వం తీసుకుందని 2012 వరకు కనీస మరుగుదొడ్డి సదుపాయాలు గాని మంచినీటి సదుపాయలు గాని ఇంతకుముందు ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయాయని బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్ణాటకలో జరిగిన అభివృద్ధి పై చర్చ కి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.ఇప్పుడు ధారవాడ భూముల్లో అభివృద్ధి ప్రవహిస్తుందని ఆయన ఇది రాష్ట్రం మొత్తం భవిష్యత్తులో నీరు అందిస్తుందని తెలిపారు.

మేము ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నామని ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తున్నామని, ప్రతి సమస్యపై పని చేస్తున్నామని .గడచిన ప్రభుత్వాలు ఏడు దశాబ్దాలలో 350 మెడికల్ కాలేజీలు మాత్రమే తీసుకొస్తే మేము గడిచిన తొమ్మిది ఏళ్లలోనే 250 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని, ఎయిమ్స్ మూడు రెట్లు పెంచామని, పేదలకు పక్కా ఇల్లు అందరికీ మరుగుదొడ్లు తీసుకొచ్చామని.కర్ణాటక లో ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేస్తున్నామనిఆయన తెలిపారు.భారీ స్థాయిలో జాతీయ రహదారులు ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఒకటని, అభివృద్ధి తమ తారక మంత్రమని మా అభివృద్ధిని చూసి బిజెపికి ఓటు వేయండి అంటూ ఆయన ఓటర్లకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు .మరి కర్ణాటక ప్రజల పై ఈ అభివృద్ది మంత్రం ఏ మాత్రం ప్రభావం చూపిస్తుందో చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube