ఎవరైనా స్టార్ హీరో నటించిన రెండు వేరు వేరు చిత్రాలు ఒకే రోజు విడుదల అయ్యావడం చాలా అరుదు. కింగ్ నాగార్జున( King Narajuna ) నటించిన రెండు చిత్రాలు ఘటోత్కచుడు, ఘరానా బుల్లోడు చిత్రాలు అప్పట్లో ఒకేరోజు విడుదలయ్యి రికార్డు క్రీస్తే చేసాయి.
కానీ ఘటోత్కచుడు సినిమాలో నాగార్జున చేసింది అతిధి పాత్ర మాత్రమే.కానీ మన బాలయ్య బాబు మాత్రం తాను నటించిన రెండు చిత్రాలను ఒకే రోజు విడుదల చేసాడు.
ఆ రెండు సినిమాలలో ఆయనే హీరో కూడా.పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలయితే ఎక్కడ బాక్స్ ఆఫీస్ వద్ద ఇబ్బంది పడాల్సి వస్తుందో అని ఆలోచించే సినిమా పరిశ్రమలో బాలకృష్ణ మాత్రం “నాకు నేనే పోటీ” అంటూ దూసుకుపోయాడు.

బాలకృష్ణ( Balakrishna ) హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం నిప్పురవ్వ( Nippu Ravva ).ఈ సినిమా 1993 సెప్టెంబర్ 3 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అదే రోజు బాలకృష్ణ హీరోగా నటించిన మరో చిత్రం కూడా విడుదలయింది.అదే రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన బంగారు బుల్లోడు కూడా విడుదలయింది.ఆశ్చర్యం ఏమిటంటే ఈ రెండు సినిమాలు మంచి మ్యూజికల్ హిట్స్.ఇంకా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటంటే బంగారు బుల్లోడు చిత్రం( Bangaru Bullodu ) సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని శతదినోత్సవ వేడుకలు జరుపుకుంటే, యావరేజ్ టాక్ తెచ్చుకున్న నిప్పురవ్వ చిత్రం కూడా అదే రోజు శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది.

అప్పట్లో హిట్ పెయిర్ గా పేరు పొందిన లేడీ సూపర్ స్టార్ విజయ్ శాంతి, బాల కృష్ణ ల కాంబినేషన్లో చివరి చిత్రం నిప్పురవ్వ.మరోవైపు రమ్య కృష్ణ, రవీనా టాండన్( Raveena Tandon ) కాంబోలో మొదటి సినిమా బంగారు బుల్లోడు.నిప్పురవ్వ సినిమాకు రాజ్ కోటి, బప్పీ లహరి, ఎ.ఆర్.రెహమాన్ దర్శకత్వం వహిస్తే, బంగారు బుల్లోడి చిత్రానికి రాజ్ కోటి సంగీతం అందించారు.30 సంవత్సరాల క్రితం మన బాలయ్యబాబు నెల్కొలిపిన ఈ అరుదయిన రికార్డును ఇంతవరకు ఏ స్టార్ హీరో బ్రేక్ చేయలేకపోయారు.