మద్యం ప్రియులకు ఝలక్.. ఆ మద్యం బ్యాన్..?

కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ మద్యం ప్రియులకు ఝలక్ ఇచ్చింది.ఆర్మీ క్యాంటీన్లలో లభ్యమయ్యే విదేశీ మద్యంపై ఆంక్షలు విధించింది.

తాజాగా కేంద్రం నుంచి విదేశీ మద్యంపై బ్యాన్ విధిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయని సమాచారం.కొన్ని నెలల క్రితం చైనా భారత్ సరిహద్దు వివాదం నెలకొనగా అప్పటినుంచి మోదీ సర్కార్ భారత్ లో తయారైన ఉత్పత్తులకు ప్రాధాన్యతనిస్తూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది.

ఈ క్రమంలోనే భారత్ చైనా యాప్ లపై నిషేధం విధించింది.దేశంలోని 4,000 ఆర్మీ క్యాంటీన్ లకు కేంద్రం నుంచి ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది.

ఇప్పటికే విదేశీ బ్రాండ్లకు సంబంధించి ఆర్మీ క్యాంటీన్ల నుంచి ఆర్డర్లు నిలిపివేయబడ్డాయని.యూకే కంపెనీ డియాజియో, ఫ్రెంచ్ కంపెనీ పెర్నోడ్ రిచర్డ్ లపై కేంద్రం నిర్ణయం ప్రభావం ప్రధానంగా పడనుందని తెలుస్తోంది.

Advertisement

సంవత్సరానికి దాదాపు 17 మిలియన్ల మేర విదేశీ మద్యం అమ్మకాలు జరగనుండగా ఆర్మీ క్యాంటీన్లలో విదేశీ మద్యం బాటిల్ పై ఉన్న ధరతో పోలిస్తే తక్కువ మొత్తానికే విక్రయిస్తారు.మాజీ సైనికోద్యోగులు, సైనికులకు కేంద్రం తీసుకున్న నిర్ణయం చిన్నపాటి ఝలక్ అనే చెప్పాలి.

అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.అయితే కేంద్రం నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ విదేశీ పెట్టుబడులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉన్నాయి.ప్రస్తుతం ఆర్మీ క్యాంటీన్ లలో 10 శాతం లోపే విదేశీ ఉత్పత్తుల విక్రయాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

అయితే కేంద్రం ఇతర విదేశీ ఉత్పత్తులపై కూడా బ్యాన్ విధిస్తుందా.? చూడాల్సి ఉంది.ప్రస్తుతం దేశంలోని స్టోర్లలో బ్యాన్ విధించిన మద్యం స్టాక్ పరిమితంగానే ఉందని సమాచారం.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

భవిష్యత్తులో మరిన్ని విదేశీ ఉత్పత్తులపై కేంద్రం ఆంక్షలు విధించనుందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు