ఊసులో లేని జనసేన!

దశాబ్దాల తరబడి రాజకీయాలలో అనేక దక్కామొక్కీలు తిన్న తెలుగుదేశం లాంటి పార్టీలు తెలంగాణ లో పోటీకిదింపడానికి బయపడుతున్న పరిస్థితుల్లో తమ అభ్యర్థులను తెలంగాణలో పోటీకి నిలపాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీసుకొని నిర్ణయం రాజకీయంగా సరైంది కాదని వస్తున్న ఫలితాలు రుజువు చేస్తున్నాయి.ముఖ్యంగా 32 స్థానాల్లో పోటీకి నిలబెట్టాలి అనుకున్నా ఆఖరి నిమిషంలో భారత జాతీయ పార్టీ( BJP ) ఎంట్రీతో 8 స్థానాలకు పరిమితమైన జనసేన( Jana sena ) కనీసం 8 స్థానాలలో కూడా ఎక్కడా రెండవ స్థానంలో కూడా నిలబడకపోవడం తెలంగాణ ఓటరు జనసేన పట్ల ఏ విధమైన ఆసక్తి లేదనడానికి రుజువుగా నిలుస్తుంది .

 No More Janasena In Telangana, Janasena, Bjp, Ts Politics , Ts Elections , Pawan-TeluguStop.com

అంతేకాకుండా ఈ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో జనసేనకు ఇబ్బందికరంగా మారే వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి .రేపటి నుంచి జనసేన విమర్శించాలనుకుంటున్న ప్రతి నాయకుడికి తెలంగాణ ఫలితాలు ఒక సాకుగా కనిపించే అవకాశం కనిపిస్తుంది.

Telugu Chandra Babu, Congrees, Janasena, Kishan Reddy, Pawan Kalyan, Ts-Telugu P

ముఖ్యంగా భౌగోళికంగా విడిపోయిన తర్వాత తెలంగాణ ఓటర్ ఆంధ్ర ప్రాంత పార్టీ లతో విముఖం గా ఉన్నాడని ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయి.మరి అనువుగాని చోట అధికులం అన కూడదన్న మౌలిక సూత్రాన్ని మర్చిపోయిన జనసేన దాని తాలూకు మూల్యాన్ని చెల్లించింది.మరి రేపు తెలుగుదేశం( TDP )తో పొత్తులో సీట్ల బేరా లలో కూడా ఈ ఫలితాలు ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Telugu Chandra Babu, Congrees, Janasena, Kishan Reddy, Pawan Kalyan, Ts-Telugu P

మరి అత్యంత కీలకమైన దశ లోకి ప్రవేశించిన ప్రస్తుత తరుణం లో ఈ ఓటమి ని జనసేన పార్టీ ఏ విదం గా డీల్ చేస్తుందో చూడాలి .నిజానికి తెలంగాణ లో పోటీ ద్వారా జనసేన కు మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది అని తెలిసినా పవన్ పోటీకి ఎందుకు సాహసించాడు అన్నది ఇంతవరకూ జనసేనాని ఎక్కడా వివరించలేదు.మరి శ్రేణుల మనో ధైర్యం కోల్పోకుండా ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికలకి నడిపించడం అనే టాస్క్ ను పవన్ ఏ మేరకు విజయవంతం గా నడిపిస్తారో చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube