ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలపై స్పందించనని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు.పార్టీకి నష్టం కలిగించకూడదనే కేశినేని కామెంట్స్ పై స్పందించడం లేదని చెప్పారు.
కేశినేని నాని చేసిన వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం చూసుకుంటుందని బుద్దా వెంకన్న తెలిపారు.ఆయన ఎన్నిసార్లు అవమానించినా సైలెంట్ గానే ఉన్నానని చెప్పారు.
ఎవరెన్ని విమర్శలు చేసినా మాట్లాడనని చంద్రబాబుకు మాటిచ్చినట్లు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలోనే కేశినేని వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు వెల్లడించారు.